చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబు.. ఇలాంటి వింత పరిస్థితా?

Chandrababu

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సీనియర్ ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమని రాజకీయ విశ్లేషకులలో చాలామంది భావిస్తారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవకుండా ఉండి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీనియర్ ఎన్టీఆర్ మరికొన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసేవారు. అయితే ఆ పాపం ఆయనను శాపంలా వెంటాడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు టీడీపీ కీలక నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రస్తుతం వైసీపీలో కీలకంగా మారారు. సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తనకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబుకు మేలు జరిగేలా ఏ పని చేయాలని లేదు. చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే తనకే నష్టమని తారక్ భావిస్తున్నారు.

మరోవైపు బాలకృష్ణ సైతం హిందూపురంలో సొంతంగా అమలు చేస్తున్న పలు పథకాలకు సీనియర్ ఎన్టీఆర్ బొమ్మను వినియోగిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు బొమ్మను వాడుకోవడం లేదు. బాలయ్య సైతం చంద్రబాబు నాయుడుకు ప్రాధాన్యతను తగ్గించడం గమనార్హం. చంద్రబాబు అప్పట్లో చేసిన తప్పులకు ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చేసిన తప్పుకు ఆలస్యంగాననైనా శిక్ష అనుభవించక తప్పదని చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే ప్రూవ్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు కొడుకు లోకేశ్ పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నీతితో కూడిన రాజకీయాలు చేయకపోవడం ఆయన ఈ పరిస్థితికి కారణమైందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.