పవన్ కళ్యాణ్ సభల్లో ఖాళీ కుర్చీలట.! వైసీపీ సెల్ఫ్ గోల్.!

వీడియోలో ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి అప్పటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ సభకు ఇంకా హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ హాజరయ్యే సమయానికి ఆ ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.

కానీ, వైసీపీ ప్రచారంలోకి తెచ్చిన వీడియోలో వ్యవహారం వేరేలా వుంది. ఖాళీ కుర్చీలతోనే పవన్ కళ్యాణ్ సభ జరగాల్సి వచ్చిందనీ, టీడీపీతో జనసేన పొత్తుని జనసైనికులు జీర్ణించుకోలేక, తమ నిరసనను ఇలా అధనేతకు తెలియజేశారనీ వైసీపీ అంటోంది.

వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ఈ ప్రచారం వల్ల జనసేనకు నస్టమేమైనా వుంటుందా.. తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఇసుకేస్తే రాలనంత జనం సర్వసాధారణం. సరే, అందులో ఎంతమంది పవన్ కళ్యాణ్‌కి ఓట్లేస్తారు.? అన్నది వేరే చర్చ.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పేలవమైన ప్రదర్శన చేయడం వల్ల, విశాఖలో జనసేన మీటింగుకి జనం రాలేదనడమూ సబబు కాదు. అధికార వైసీపీ, తమ అధికారిక కార్యక్రమాల కోసం, జనాన్ని తరలించడం తెలిసిన విషయమే.

జనసేనకు అసలు అలాంటి ‘తరలింపు’ అవసరాలుండవ్. స్వచ్ఛందంగా కార్యకర్తలు జనసేన వెంట నడుస్తున్నారు. మరి, ఓట్లెందుకు అన్ని రావట్లేదు.? అంటే, ముందే చెప్పుకున్నట్లు.. అది మళ్లీ వేరే చర్చ.

జనసేన పార్టీ కార్యక్రమానికి జనం రావడంలేదంటూ వైసీపీ చేసే ప్రచారం వల్ల, జనసేనకు అదనపు లాభం చేకూరుతుంది. ఎందుకంటే, తదుపరి సమావేశాలకు జనసైనికులు ఇంకాస్త ఎక్కువగా హాజరవుతారంతే.! ఆ రకంగా వైసీపీ, జనసేనకు మేలు చేసినట్లువుతంది. అదే సమయంలో, ఈ తరహా ప్రచారాల వల్ల వైసీపీ, అభాసుపాలవుతుంది.