నితిష్ కుమార్ పార్టీలో చేరిన ప్రశాంత్ కిశోర్

ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ రాజకీయ నాయకుడవుతున్నారు. ఆయన ఆదివారం నాడు బీహార్ ముఖ్యమంత్రి  నితిష్ కుమార్ నాయకత్వంలోని  జనతా దళ్ (యు ) పార్టీ లో చేరారు.  భారతదేశంలో ఎన్నికల వ్యూహాన్ని ఒక ప్రత్యేక మయిన కార్యక్రమంగా మార్చింది ప్రశాంత్ కిశోరే. ఎన్నికల ప్రచారాన్ని సోషల్ మీడియా వైపు మళ్లించింది  ప్రశాంత్ కిశోరే. ఎన్నికల ప్రచారాన్ని కోట్లకు కోట్ల బిజినెస్ గా మార్చింది కూడా ఆయనే.

ఆయన 2012 గుజరాత్ లోఅప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీ మూడో సారిముఖ్యమంత్రి అయ్యేందుకు వ్యూహరచన ఎన్నికల వ్యూహం  ఒక మేనేజ్ మేంట్ శాస్త్రంగా మార్చారు. ఎన్నిలక పంధా అనుకుంటే రూట్ మార్చవచ్చిన భారత్ దేశంలో అందరిని నమ్మించాడు.  అంతకుముందుకు ఎన్నికల వ్యూహాల పార్టీల నేతలకో, లేదా పార్టీలలో ఒక ఉండే కమిటీకో పరిమితమయి ఉండేది. దాన్ని ఆయన తాను లాగేసుకుని ఓటర్ల ఆలోచనను ఒక వ్యూహం ప్రకారం పార్టీలకు అనుకూలంగా మలచవచ్చని నిరూపించారు. గుజరాత్ ఎన్నికల తర్వాత ఆయనకు బాగా డిమాండ్ పెరిగింది.  చేతులు ఊపి ఊపి, నాటకీయంగా  మాట్లాడటం మోదీకి నేర్పించింది కూడా ఆయనేనని చెబుతారు. ప్రశాంత్ కిశోర్ నాయకుడి డ్రెస్ కి, హావభావాలకు, భాషకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.  రాజకీయ పార్టీలకు తెలియని ఈ విషయాలను బోధించి నాయకుడిని తన చేతుల్లోకి తీసుకోవడం ప్రశాంత్ కిశోర్ ప్రత్యేకత.ఇంత సునిశితంగా ఆయన ప్రతివిషయాన్ని పరిశీలించి పార్టీనేతకు సలహాలిస్తారు కాబట్టి ఆయనను పార్టీ అంతరంగికి సమావేశాలకు కూడా ఆహ్వానిస్టుంటారు. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఏకంగా ఆయనకు క్యాబినెట్ ర్యాంకిచ్చి, ప్రజలడబ్బుతె తెలివి పార్టీ వ్యవూహాన్ని తయారుచేయించుకున్నారు.

2014 లో  లోక్ సభ ఎన్నికల్లో ఆయన బిజెపి వ్యూహకర్తగా పని చేశారు. మోదీ గెలవడంతో ఆయన నైపుణ్యానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది.  చాయ్ పే చర్చ వంటి ఆసక్తి కరమయిన అంశాలు రంగంమీదకు తీసుకువచ్చి, పార్టీలు ఏమిచేశాయనేదాని కన్నా లీడర్ ఏమిచెబుతున్నాడనే దాని చుట్టూ ఎన్నికల ప్రచారాన్ని తిప్పాడు. లీడర్ ఏమ్మాట్లాడలో, ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో,  ఏ హామీ ఇవ్వాలో… తన చేతుల్లోకి తీసుకున్నాడు.  చివరకు లీడర్లే బహిరంగా, ‘ప్రశాంత్ కిశోర్ మనతో ఉన్నాడు, మనం గెలుస్తాం’ అనే స్థాయికి ఎన్నికల ను దిగజార్చింది కూడా ఆయనే. ఆతర్వాత బీహార్ లో ఒక దఫా లాలూ ప్రసాద్ కు, మరొక సారి నితీష్ కుమార్ కు సహకరించారు. ఆపైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన బిజెపికి వ్యూహకర్తగా ఉన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ కు గెలుపునకు కూడా ఆయనవ్యూహం రచించారు.

  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు ఓటర్లు నాడి ఎంతవరకు తెలుసో ఇంతవరకు ఇతర పార్టీలకు చెబుతూ వచ్చారు. ఆయన శాస్త్రం ఇపుడు తొలిసారిగా ఆయన దగ్గిరే పరీక్షకు కూర్చుంటూ వుంది.  ఏమవుతుందో చూడాలి.

తన రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచి ఆరంభించనున్నాడు. దీని గురించి ఈరోజు ఆయనొక ట్వీట్ చేశారు.

  ‘బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది’ అని  ట్వీట్ చేశాడు.  ఇపుడాయన ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఈ మధ్య పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల, ఆయన పాదయాత్ర వెనక ప్రశాంత్ కిశోర్ ఉన్నారని చెబుతారు.  ఇపుడాయన బీహార్ లో రాజకీయనాయకుడి అవతారం ఎత్తడంతో ప్రత్యక్షంగా వైసిపి కోసం సమయం కేటాయించగలరా అనేది అనుమానం. తాను జనం మధ్య పనిచేయాలనుకుంటున్నట్లు ఆమధ్య ఐఎస్ బిలో జరిగిన ఒక సదస్సులో ఆయన పేర్కొన్నారు. అపుడే ఇక తన టీములు ఈ పనిచేసుకుపోతుంటాయని కూడా చెప్పారు.

ఈ రోజు పట్నాలో నితిష్ కుమార్ పార్టీ కండువా కప్పి ప్రశాంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు. తర్వా త జరిగిన నేషనల్ ఎగ్జి క్యూటివ్ లో నితిష్ కుమార్ పక్కనే కూర్చోబెట్టారు. పార్టీలో ప్రశాంత్ హోదా ఏమిటో ఇంకా స్పష్టం కావడం లేదు.

ప్రశాంత్ కిశోక్ బీహార్ చెందిన వ్యక్తే. అక్కడి బక్సర్ జిల్లాకు చెందిన వ్యక్తి. అక్కడి నుంచే ఆయన వచ్చే ఎన్నికల్లో పోట ే చేయవచ్చని కూడా చెబుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ నిజానికి పబ్లిక్ హెల్త్ నిపుణుడు. చాలా కాలం ఆయన ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు ఆపైన ఇండియా వచ్చి రాజకీయ పార్టీలకు ఏది అవసరమో గుర్తించి ఈవ్యాపారంలోదిగారు.  ఆయన వచ్చాక ఎన్నికలు అధ్యయనం, ప్రజల మూడ్ అనేవి పెద్ద వ్యాపార మయ్యాయి. ప్రభుత్వాలు, పార్టీలు, ప్రజా ప్రతినిధులు ప్రతి విషయం గురించి  సర్వేలు చేయించి జనం నాడి కనుక్కోవడం ఎక్కువయింది. సర్వేలు కోట్లాది రుపాయల వ్యాపారంగా వర్ధిల్లు తున్నాయి.

 

రెండు నెలల కిందట వరకు వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేశారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న  ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేయడం దాదాపు కష్టమేనని భావించాలి.