పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇంటెలిజెన్స్ ఐబి ఏబి వెంకటేశ్వరరావుపై వేటు వేసిన ఎన్నికల కమీషన్ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేతాపై వేటు వేసింది. తన ఆదేశాల ప్రకారం ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేసిన పునేత మరుసటి రోజు బదిలీని రద్దు చేశారు. అప్పట్లో ఆ విషయం సంచలనంగా మారింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి కానిస్టేబుల్ వరకూ ప్రతీ ఒక్కళ్ళు ఈసి పరిధిలోకి వెళిపోతారు. అలాంటిది ఐబి చీఫ్ ను బదిలీ చేసినట్లే చేసి మళ్ళీ బదిలీని క్యాన్సిల్ చేయటంతో ఈసికి మండిపోయింది. అదే విషయమై ఈసి పునేతాను ఢిల్లీకి పిలిపించుకుని సంజాయిషీ అడిగింది. చంద్రబాబునాయుడు ఒత్తిడి మేరకే తాను బదిలీని నిలిపేసినట్లు చెప్పారని సమాచారం.
పునేత సమాచారంతో సీఈసికి ఒళ్ళుమండిపోయిందట. రాతమూలకంగా సంజాయిషీని తీసుకున్న సిఈసి పునేతను పంపించేసింది. మూడు రోజుల తర్వాత హఠాత్తుగా పునేతాను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. పునేత ప్లేస్ లో ఎల్వీ సుబ్రమణ్యంను నియమించింది. పునేతను బదిలీ చేయటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈసి దెబ్బకు ఇప్పటికి రెండు పెద్ద వికెట్లు పడిపోయాయి. ఇక మిగిలింది డిజైపి ఆర్పి ఠాకూర్. ఎందుకంటే ఠాకూర్ మీద కూడా వైసిపి ఎన్నో ఆధారాలతో కూడిన ఫిర్యాదులను సీఈసికి అందించిది.