తెరపైకి కొత్త ఇష్యూ… బాబు ఆర్థిక నేరాల‌పై ఈడీ జోక్యం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు రూ.118 కోట్ల రూపాయల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఐటీ అధికారులు ఫుల్ క్లారిటీతో ఉన్నారని.. రాజకీయ జోక్యాలు లేనిపక్షంలో బాబుకు మామూలు వాయింపు ఉండదనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో ఈడీ అధికారులు కూడా జోక్యం చేసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఐటీ డిపార్ట్ మెంట్ అధికారులు తీగలాగారు.. ఈడీ వచ్చి డొంకంతా కదిలించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ మంత్రులు. ఇందులో భాగంగా… రూ.118 కోట్లు అనేది జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే అని, ఈడీ కూడా ఎంటరైతే మొత్తం వ్యవహారం, బాబు మొత్తం బాగోతం తెరపైకి వస్తుందని అంటున్నారు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు!

తాజాగా చంద్రబాబుపై ఏపీ మంత్రి అమర్ నాథ్ ఫైరయ్యారు. ఇందులో భాగంగా… చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ దుయ్యబట్టారు.

ఇదే సమయంలో దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని ఫైరయిన అమర్నాథ్… ఆర్థిక నేరాలపై మీడియాలో అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా… చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదే క్రమంలో చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచే వైసీపీ నాయకుల్లో ఒకరైన మంత్రి రోజా… తాజాగా వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా… చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని అన్నారు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు… ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఫైరయ్యారు.

ఇదే సమయంలో చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్‌ చేయలేదని ప్రశ్నించిన రోజా… పవన్‌ కళ్యాణ్‌ ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్‌ చేశారు.

అనంతరం చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, నమ్మక ద్రోహి అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని చంద్రబాబు తమ నేతలకు చెబుతున్నారని కొడాలి నాని ఫైరయ్యారు! ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసని కొడాలి నాని అన్నారు.

చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని చెప్పిన కొడాలి నాని… ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని తనదైన శైలిలో ప్రశ్నించారు.

ఇదే సమయంలో బాబు కు ఐటీశాఖ ఇచ్చిన నోటీసులపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్‌లు పెద్ద అవినీతి­పరులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా… ప్రజలు అప్రమ­త్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికార­మిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తార­ని అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు.