పాలిటిక్స్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సైలెన్స్ కు కారణమిదేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ గా సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉన్న అతికొద్ది మంది హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. అయితే తారక్ మాత్రం ఈ మధ్య కాలంలో పొలిటికల్ విషయాలకు సంబంధించి స్పందించడానికి దూరంగా ఉన్నారు. అయితే రాజకీయాలకు సంబంధించి తానేం మాట్లాడినా బాలయ్య ఫ్యామిలీకి మరింత దూరమవుతానని తారక్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే బాలయ్యకు తారక్ కు మధ్య గ్యాప్ ఉంది. తారక్ రాజకీయాల్లోకి రావడం బాలయ్యకు అస్సలు ఇష్టం లేదు. తారక్ టీడీపీలో యాక్టివ్ అయితే మొదట నష్టపోయే వ్యక్తి లోకేశ్ అనే సంగతి తెలిసిందే. ఈ రీజన్ వల్లే బాలయ్య తారక్ రాజకీయాలకు ప్లస్ కావచ్చని మైనస్ కావచ్చని గతంలో కామెంట్లు చేయడం గమనార్హం. మరోవైపు చంద్రబాబు సైతం ఇదే భావనను కలిగి ఉన్నారు.

టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అయితే ఆ తర్వాత పార్టీ తారక్ చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆయన భావిస్తున్నారు. రాజకీయంగా తనకు ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయడం లేదని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో కూడా రాజకీయాల్లో యాక్టివ్ కావడం తేలిక కాదని ఇండస్ట్రీలో వర్గాల్లో వినిపిస్తూ ఉండటం గమనార్హం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ అనవసర వివాదాల వల్ల తన సినీ కెరీర్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. సినిమాల్లోనే మరిన్ని విజయాలను అందుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఆయన అనుకుంటున్నారని సమాచారం అందుతోంది. అయితే తారక్ రాజకీయాలకు సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తుండటం గమనార్హం.