సీఎం కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టిన డిఎస్

తెలంగాణ ప్రజలకు తన వ్యక్తిత్వం ఎటువంటిదో తెలుసని టిఆర్ ఎస్ నేత డిఎస్ అన్నారు. తాను టిఆర్ ఎస్ పార్టీకి ఏ విధంగా నష్టపరిచానో పార్టీ నాయకత్వం తెలపాలన్నారు. తన కుమారులు స్వతంత్రంగా పెరిగారని స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని డిఎస్ తెలిపారు. వారు  ఏ పార్టీలో చేరాలనేది వారిష్టమని ఇది అందరి ఇండ్లలో ఉన్న పంచాయితే అని డిఎస్ వ్యాఖ్యానించారు.

నా అంతట నేను రాజీనామా చేయనని, అలా చేస్తే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేనన్నారు. తాను చేసిన తప్పేంటో ప్రజా ప్రతినిధులు చెప్పాలని డిఎస్ ప్రశ్నించారు. దయచేసి తనను మీరే సస్పెండ్ చేయాలన్నారు. తన కుమారున్ని నానా ఇబ్బందులు పెట్టారని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అన్నింటిని తట్టుకొని నిలబడ్డానన్నారు.  

కేభినేట్ లో చాలా మంది అసంతృప్తులున్నారు. వారందరు కూడా త్వరలోనే బయటికొస్తారని తెలిపారు. తనను మీరే సస్పెండ్ చేయండి అది చేతకాకపోతే తీర్మానం వెనక్కు తీసుకోవాలని డిఎస్ డిమాండ్ చేశారు. టిఆర్ ఎస్ జిల్లా నాయకత్వం తనపై కుట్ర పన్నిందన్నారు. కార్యకర్తలంతా అండగా ఉండటాన్ని చూస్తే తనలో ధైర్యం పెరిగిందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎక్కడా చిన్న మచ్చ లేదన్నారు.

డిఎస్ చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేవిధంగా ఉన్నాయని నాయకులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలలో జరిగిన అనూహ్య మార్పులతో సీఎం కేసీఆర్ బిడ్డా, ఎంపీ కవిత డిఎస్ ను సస్సెండ్ చేయాలని పార్టీ నేతలతో సమావేశమై తీర్మానం చేసి దానిని అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు పంపారు. దీంతో అప్పటి నుంచి డీఎస్ కేసీఆర్ ఎడామొహం, పెడామొహంగా ఉన్నారు. సీఎం అపాయిట్ మెంట్ కూడా డిఎస్ కు ఇవ్వలేదు. దీంతో డిఎస్ మంగళవారం నిజామాబాద్ లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.