మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నా అనుకూల పరిస్థితులు లేవనే సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తులో ఉండటంతో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గతంలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఏపీకి మాత్రమే పరిమితం కావాలని ఫిక్స్ అయ్యారు.
బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు తాను బీజేపీకి అనుకూలమో లేక వ్యతిరేకమో వెల్లడించాల్సిన సమయం ఆసన్నమైంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ మోదీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి జట్టుగా తయారయ్యే ప్రయత్నాలను మొదలుపెట్టడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఈ నెల 25వ తేదీన జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ కు, ఏపీనుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అయితే చంద్రబాబు ఈ సమావేశానికి హాజరయ్యేంత సాహసం చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరైతే ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో కేంద్రం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.
చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ చిన్న పొరపాటు చేసినా అయన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు తెలివిగా అడుగులు వేయకపోతే 2024లో కూడా ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు నితీష్ ఏర్పాటు చేస్తున్న మీటింగ్ కు వెళ్లే ధైర్యం ఉందో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.