స్పీకర్ తమ్మినేనికి సీఎం జగన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

Do you know the gift given by CM Jagan to Speaker Tammineni?

ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి బాగా కలిసి వచ్చాయట. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీకి వ‌చ్చిన కొడుకు త‌మ్మినేని నాగ్‌ను సీఎం జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం చేశారట స్పీక‌ర్‌. ఈ క్రమంలో త‌మ్మినేని నాగ్‌ వ్యక్తిగ‌త వివ‌రాల‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాష‌ణ‌ల నేప‌థ్యంలోనే త‌న కుమారుడి రాజ‌కీయ అరంగేట్రం విష‌యాన్ని సీతారాం జ‌గ‌న్ చెవిలో ప‌డేశారు. దీనికి జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. త్వర‌లోనే త‌మ్మినేని నాగ్‌ పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రానున్నారు. శ్రీకాకుళంలోనే ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాగ్‌ను పోటీ చేయించాల‌ని స్పీక‌ర్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Do you know the gift given by CM Jagan to Speaker Tammineni?
Do you know the gift given by CM Jagan to Speaker Tammineni?

ఆముదాల వ‌ల‌స నుంచి సీతారాం పోటీ చేసినా.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుని త‌మ్మినేని నాగ్‌ను బ‌రిలోకి దింపుతార‌ని అంటున్నారు. అయితే ఒకే కుటుంబానికి జ‌గ‌న్ రెండు సీట్లు ఇస్తారా ? అన్నది స‌స్పెన్స్ అయినా జ‌గ‌న్ ఇక్కడ ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఈ కుటుంబానికి రెండు సీట్లు వ‌చ్చే ఛాన్స్ కూడా క‌నిపిస్తోంది. టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడుకు ధీటుగా ఎద‌గాల‌ని త‌మ్మినేని నాగ్‌కు జ‌గ‌న్ సూచించ‌డాన్ని బ‌ట్టి చూస్తే నాగ్‌కు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చినా ఇవ్వొచ్చన్నదే జ‌గ‌న్ ఆలోచ‌నేమో ? చూడాలి.

రాజ‌కీయాల్లోకి రావాల‌నేది త‌మ్మినేని నాగ్‌ ఆలోచ‌న‌. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో సీతారాం గెలుపున‌కు నాగ్ ఎంతో కృషి చేశార‌ని ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం ఉంది. యువ‌త‌ను ప్రధానంగా ఆక‌ర్షించి.. త‌న తండ్రికి ఓట్లు వేయించ‌డంలో త‌మ్మినేని నాగ్‌ మంచి వ్యూహంతో ముందుకు సాగార‌ని అంటున్నారు. ఇక, సీతారాం కూడా త‌న కుమారుడిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దింపాల‌ని నిర్ణయించుకున్నార‌ని అంటున్నారు. త‌మ్మినేని ఇప్పటికే మూడున్నర ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉంటున్నారు. టీడీపీలో ఉండ‌గా అప్పుడెప్పుడో 1999లో చివ‌రిగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత ఇర‌వైయేళ్లకు గ‌త యేడాది మ‌ళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఆయ‌న త‌ప్పుకుంటారా ? లేదా ఇద్దరూ రంగంలో ఉంటారా ? అన్నది చూడాలి.