హోం మంత్రి సుచరిత చొరవతో దివ్య తేజస్విని హత్య కేసులో జగన్ ని కలవబోతున్న తల్లి దండ్రులు

divya tejaswani

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని వంకాయలపాటి దివ్య తేజస్విని హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు నాగేంద్ర ఓ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నాడు. నాగేంద్రను కఠినంగా శిక్షించాలంటూ దివ్య తల్లిదండ్రులు ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కోరారు.

home minister sucharitha file photo

అయితే,ఈ రోజు దివ్య తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలవబోతున్నారు. రాష్ట్ర హోం మంత్రి సుచరితతో కలిసి సీఎం జగన్‌ను కలవబోతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలుస్తారు. సీఎం జగన్‌ను కలిసే ఏర్పాటు చేయాలని రెండ్రోజుల క్రితం పరామర్శించడానికి వెళ్లిన హోం మంత్రిని దివ్య కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. దివ్య తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎంను కలిసేందుకు మంత్రి ప్రత్యేకంగా చొరవ చూపారు. ఈ తరుణంలో దివ్య తల్లిదండ్రులను కలవడానికి మంగళవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

divya with murderer nagendra

హోంమంత్రి సమక్షంలో కలిసి జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వారు తీసుకెళ్లనున్నారు. కాగా, తేజస్వి హత్య కేసులో ఇప్పటికే దూకుడుగా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.