Divvela Madhuri: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వేల మాధురి వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. ఈమె తన భర్త పిల్లలను వదిలేసి దువ్వాడ శ్రీనివాస్ వద్ద సహజీవనం చేస్తూ ఉన్నారని గత కొన్ని నెలల క్రితం దువ్వాడ భార్య వాని వెల్లడించారు. అయితే ఈ విషయంపై వీరిద్దరూ మీడియా సమావేశంలో అన్ని విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతానికి తామిద్దరం ఒకే చోట ఉంటున్నామని ఈ కోర్టు వ్యవహారాలు అన్ని పూర్తి కాగానే తామిద్దరం పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిస్తామని తెలియజేశారు. ఇకపోతే తాజాగా మాధురి పుట్టినరోజు వేడుకలను దువ్వాడ శ్రీనివాస్ ఎంతో అద్భుతంగా జరిపించారు.
మాధురి పుట్టినరోజు వేడుకలను ఈయన టెక్కలి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజల సమక్షంలో జరిపించారు. అక్కడ వచ్చిన ప్రజల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారందరికీ వివిధ రకాల వంటకాలను వడ్డించారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాధురి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నా రాజా సమక్షంలో నేను జరుపుకుంటున్న ఈ మొదటి పుట్టినరోజు నాకెంతో స్పెషల్ అని ఈమె తెలియజేశారు.
మరి మీ పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ గారు ఏదైనా కానుక ఇచ్చారా అంటూ కూడా మీడియా ప్రశ్నించడంతో మాధురి సమాధానం చెబుతూ ఎంతో అద్భుతమైన వెలకట్టలేని కానుక ఇచ్చారని అది ఆయన మనసే నాకు కానుకగా ఇచ్చారు అంటూ మాధురి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం మేమిద్దరం మానసికంగా భార్య భర్తలం మాత్రమే ఈ కోర్టు కేసు వ్యవహారాలని పూర్తి కాగానే మేము పెళ్లి చేసుకుంటామని కూడా తెలిపారు. ఇక ఇటీవల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు కూడా మాధురి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈమె తనకు ఏకంగా రెండు లక్షల విలువైన వాచ్ ను కానుకగా అందజేసిన విషయం మనకు తెలిసిందే.