Mrunal Thakur: టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సీత పాత్రలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఈమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఈమెను అభిమానించే వారి సంఖ్య కూడా మరింత పెరిగింది.
కాగా మృణాల్ ఠాకూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇకపోతే మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఇందులో అడవి శేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
అయితే నేడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న అనగా జూలై 31వ తేదీన డెకాయిట్ మూవీ సెట్స్ లో ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు మూవీ మేకర్స్. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫోటోలలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటుగా, హీరో అడవి శేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Mrunal Thakur: డెకాయిట్ మూవీ సెట్ లో ఘనంగా మృణాల్ ఠాకూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోస్ వైరల్!
