Divvela Madhuri: దివ్వెల మాధురి ఇటీవల కాలంలో ఈమె పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. ఈమె వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ లో ఉంటున్నారా అనే వార్తలు బయటకు రావడంతో వీరిద్దరూ కూడా తమ రిలేషన్ గురించి బహిరంగంగా తెలియజేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలచారు. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతలపై అడ్డుగోలుగా అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వారిని దూషించిన వారి పట్ల చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్వెల మాధురి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎంతో అభ్యంతరకరమైన పోస్టులు వీడియోలు చేస్తున్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి అంటూ దివ్వెల మాధురి టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు చేసే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూటమినేతలు చెబుతున్నారు ఈ క్రమంలోనే తన గురించి అలాగే శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో చేస్తున్న అసభ్యకర పోస్టులపై ఈమె చర్యలు తీసుకోవాలి అంటూ ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించారు. మరి అధికారులు కేవలం కూటమి నేతలను ఇబ్బంది పెట్టిన వారిపైన చర్యలు తీసుకుంటారా లేక ఇతర పార్టీల గురించి తమ సొంత పార్టీ కార్యకర్తలు చేసిన పోస్టులను కూడా పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియాలో కూటమి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గురించి ఇతర వైకాపా నాయకుల గురించి అసభ్యకర పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు దీంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై విమర్శలు రావడమే కాకుండా ఈ విషయం గురించి వైకాపా నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మరి మాధురి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.