తమ్ముడికి పదవి ఇచ్చినా అలిగిన వైసిపి సీనియర్ నేత

తమ్ముడికి పదవి ఇచ్చినా అలిగిన వైసిపి సీనియర్ నేత

నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులైన ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎన్నికలకు ఏడాది ముందరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జగన్ హామీ ఇచ్చినట్టు అప్పటివరకు వెంకటగిరి ఇంఛార్జిగా వున్న బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని కాదని రామ్ నారాయణ రెడ్డి కి ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ సీటు ఇవ్వడం ఆయన గెలిచి ఎమ్మెల్యే అవ్వడం కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో తనకున్న అనుభవంతో దృష్ట్యా రామ్ నారాయణ రెడ్డి తనకి మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మొదటినుంచి తనకి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులకి కేబినెట్లో ప్రాధాన్యతనిచ్చారు. ఆ ఆలోచన మేరకు అనిల్ కుమార్ యాదవ్ మరియు మేకపాటి గౌతమ్ రెడ్డి ని కేబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో సీనియర్ నాయకులు అయినా రామ్ నారాయణరెడ్డి తనకు తగిన గౌరవం దక్కలేదని కొంత అసహనంగా అసంతృప్తిగా ఉన్నారు.

అయితే ఈ మధ్య జరిగిన మరో సంఘటన ఆయనని మరింత అసంతృప్తికి గురిచేసిందని తెలుస్తుంది. ఆనం రాంనారాయణ రెడ్డి తన అనుచరుడైన జనార్దన రెడ్డికి డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వమని ముఖ్యమంత్రికి సిఫారసు చేయడం జరిగింది. అయితే జగన్ మాత్రం ఆ పదవిని ఆనం విజయ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టారు.

ఇలా చేయడానికి కి ప్రధానమైన కారణం ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్థానిక సంస్థల కోటాలో పోటీ చేశారు. ఆయన ఓడిపోతామని తెలిసి ఆరోజు పార్టీ శ్రేయస్సు దృశ్యం పోటీ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకున్న ముఖ్యమంత్రి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని భావించారు. అయితే మరో రెండు సంవత్సరాల వరకు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కావడం లేదు కనుక ఈ లోపల విజయ్ కుమార్ రెడ్డికి డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

విజయ్ కుమార్ రెడ్డి రామ్ నారాయణ రెడ్డి కి స్వయానా తమ్ముడు అయినా కూడా తన సిఫారసు చేసిన తన అనుచరునికి పదవి ఇవ్వలేదని, తన మాటకి తన సీనియారిటికి పార్టీ లో గౌరవం లేదని ఆనం రాంనారాయణ రెడ్డి తన అనుచరులు దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Anam Ram Narayana Reddy

<

p style=”text-align: justify;”>