నిస్సిగ్గ రాజకీయం: చంద్రయాన్ ఎవరి ఘనత.?

ఓ వైపు చంద్రయాన్ ప్రయోగంలో కీలక ఘట్టానికి సంబంధించి లైవ్ వస్తోంది.! పారమీటర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయ్. పక్కనే, అనూహ్యంగా ప్రధా మంత్రి ప్రత్యక్షమైపోయారు. మామూలుగా అయితే, ఇక్కడ ప్రధాని వీడియో ఎందుకు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.

బీజేపీ భక్తులకి ఈ ప్రశ్న అస్సలు మింగుడు పడదు.! ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏం చెబుతారా.? అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకింత సుదీర్ఘంగా ప్రసంగించేశారు. అది వినలేక, వీక్షకులకు నీరసం వచ్చేసింది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఏవో మాట్లాడారు.. అవి చాలామందికి రీచ్ కాలేదు.

ఈ తరహా ప్రయోగాల సమయంలో, రాజకీయ నాయకుల ప్రసంగాలు దేనికి.? ప్రధాన మంత్రి హోదాలో.. నరేంద్ర మోడీ సందేశం ఇవ్వడాన్ని తప్పు పట్టలేం. కానీ, మరీ ఇంతలానా.? మోడీ ప్రసంగం విసిగించేస్తే, ఇంకోపక్క.. చంద్రయాన్ ఘనత నరేంద్ర మోడీదేనంటూ సోషల్ మీడియాలో బీజేపీ భక్తులు హోరెత్తించేస్తున్నారు.

చంద్రయాన్ ప్రయోగం కోసం వేల మంది పని చేశారు. 140 కోట్ల మంది భారతీయులు ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని సందేశమిస్తే.. అది సందేశానికే పరిమితమయి వుండాల్సింది. ఇలాంటి విషయాల్లో కూడా ‘పొలిటికల్ క్రెడిట్’ కోసం ఆరాటపడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

దేశంలో పరిస్థితి ఇలా వుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ – టీడీపీ మధ్య ఈ చంద్రయాన్ చిచ్చు మరింత హాస్యాస్పదంగా మారింది. ‘చంద్ర’ పేరు చుట్టూ జరుగుతున్న రాజకీయ రచ్చ అత్యంత జుగుప్సాకరం.!