చంద్రబాబు అలా కేసీఆర్ ఇలా.. ఎవరి కోరిక నెరవేరుతుందో? d

chandrababu kcr telugu rajyam

2024 ఎన్నికల సమయానికి టీడీపీ బీజేపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ మీడియాలో కథనాలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటంతో పాటు వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించడానికి అటు టీడి ఇపీ కానీ ఇటు బీజేపీ కానీ ఇష్టపడటం లేదు. ఎన్డీయేలోకి టీడీపీ అంటూ రిపబ్లిక్ టీవీలో కథనం ప్రసారం కావడంతో ఈ వార్త నిజమేనని చాలామంది నమ్ముతున్నారు.

గత కొన్నేళ్ల నుంచి బీజేపీతో స్నేహం కోసం టీడీపీ వేచి చూస్తోంది. బీజేపీతో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా కేంద్రం మద్దతు తమ పార్టీకే ఉందని తెలియజేయడంతో పాటు వైసీపీని ఇబ్బంది పెట్టాలని టీడీపీ అనుకుంటోంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతు ఇవ్వకపోవడం వల్లే టీడీపీ నష్టపోయిందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పుడు ఎన్డీయేలో చేరడం ద్వారా ఏపీలో తెలంగాణలో అధికారంలోకి వచ్చినా రకాపోయినా కేంద్రం మద్దతుతో టీడీపీ భవిష్యత్తు కొనసాగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

అయితే బీజేపీ వైసీపీ మద్దతు సైతం కోరుతున్నా వైసీపీ పరోక్షంగా మద్దతు ఇస్తామని చెబుతోంది కానీ ఎన్డీయేలో చేరడానికి ఆసక్తి కనబరచలేదు. ఈ కారణం వల్లే బీజేపీ వైసీపీతో కాకుండా టీడీపీతో పొత్తుపై ఆసక్తి చూపింది. అయితే ఇదే సమయంలో కేసీఆర్ మాత్రం బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

2024 ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు ప్లస్ అవుతాయో కేసీఆర్ కు ప్లస్ అవుతాయో చూడాల్సి ఉంది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అడుగులు వేస్తుండటం గమనార్హం. అయితే కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లడం వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటు పడుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.