రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల ప్రజలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిని ఎలాగైన మార్చాలని సిద్ధమైన జగన్ ప్రభుత్వం దాని కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్ణయించింది. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతరులు వెళ్లడానికి ఇబ్బందులొస్తాయనే ముందస్తు సూచనతో మరో మర్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. క్రిష్టాయపాలెం చెరువు నుంచి శాసనసభకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును( జెడ్ రోడ్డు)ను ఏర్పాటు చేశారు. కేవలం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకే ఈ రోడ్డు ఏర్పాటైంది. ఆ తర్వాత దీనిని వాడటం లేదు. ఆ తర్వాత పైపులైన్లు ఏర్పాటు కోసం దానిపై పెద్దపెద్ద గుంతలు తవ్వారు. ప్రస్తుతం నిరసనలు తీవ్రంగా జరుగుతున్నందున మరో మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
ఈనెల 20న అసెంబ్లీ సమావేశాల్లో జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికపై చర్చించనున్నారు. వీటి కోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేను, అధికారులు సీడ్‌యాక్స్ స్ రోడ్డు మీదగా ప్రస్తుత అసెంబ్లీకి రావాలి. ఆందోళన జరుగుతున్నందున వారి రాకపోకలను అడ్డుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారుల నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో అసెంబ్లీకి వచ్చే క్రిష్టాయపాలెం చెరువు దగ్గర నుంచి అసెంబ్లీకి వచ్చే రోడ్డుకు మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు.