Devineni Uma: దేవినేని ఉమ రాజకీయం: బాబు పేరు చెబితే వదిలేస్తామన్నారా.?

Devineni Uma Politics: AP CID Asks to admit CBN's name

Devineni Uma: ఎక్కడన్నా ఇలా జరుగుతుందా.? చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తామని ఏపీ సీఐడీ అంటుందా.? వైసీపీ నేత చేసిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏపీ సీఐడీ, ఎలక్ట్రానిక్ డాక్యమెంట్ల ఫోర్జరీ కింద మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుని నిన్న విచారించిన విషయం విదితమే. విచారణ నుంచి తప్పించుకునేందుకు ఉమ వేసిన ఎత్తులు పారలేదనుకోండి.. అది వేరే సంగతి. కోర్టు సూచనతో, ఉమ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది.

Devineni Uma Politics: AP CID Asks to admit CBN's name
Devineni Uma Politics: AP CID Asks to admit CBN’s name

విచారణ సందర్భంగా పోలీసులు, దేవినేని ఉమ మీద ప్రశ్నాస్త్రాలు సంధించడం మామూలే. వాటికి ఆయన సమాధానం చెప్పారా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, ఎలక్ట్రానిక్ డాక్యముంట్ల ఫోర్జరీ వ్యవహారంలో చంద్రబాబు పేరు చెబితే, వదిలేస్తామని ఏపీ సీఐడీ, దేవినేని ఉమకు ఎలా ‘బంపర్ ఆఫర్’ ప్రకటిస్తుంది.? గతంలో  పలు కేసుల విచారణ సందర్భంగా ఈ తరహా ఆరోపణలు, విచారణ సంస్థలపైన రావడం చూశాం. అసలు అలాంటి పరిస్థితి వుంటుందా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి. గతంలో.. అంటే చంద్రబాబు హయాంలో, విచారణ సంస్థలపై అప్పటి వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలే చేశారు. అవే ఆరోపణలు, కాస్త మార్చి.. ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్నారంతే.

అప్పుడూ ఇప్పుడూ అవే విచారణ సంస్థలు. తమకు నచ్చినవారిని ఆయా విచారణ సంస్థలకు అధిపతులుగా అధికారంలో వున్నవారు నియమించడమనేది కూడా సర్వసాధారణమైన వ్యవహారమే. ఏవో ఉత్తుత్తి ఆరోపణలు విచారణ సంస్థల మీద సరిపోదు. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో ప్రతి విషయమూ వివాదాస్పదమవుతోంది. ఆరోపణలకు ఎవరూ అతీతం కాదిప్పుడు. ఇదిలా వుంటే, దేవినేని ఉమ విచారణకు సహకరించలేదన్న వాదన తెరపైకొస్తోంది. ఇంకోసారి ఆయన్ని విచారణకు పిలవనుంది ఏపీ సీఐడీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించినదిగా చెప్పబడుతున్న వీడియో తాలూకు వివరాల్ని, దేవినేని ఉమ.. సీఐడీకి అందించాల్సి వుంది.