Raghurama Krishnamraju: ఇది రఘురామ ప్రిస్టేజ్ కి సంబంధించిన విషయం.. డీజీపీ ఏమంటారో..!

Raghurama Krishnamraju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు – సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య సాగుతున్న మాటల, పోస్టుల వార్ అత్యంత రసవత్తరంగా మారిందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ వార్ తాజాగా మరో మలుపు తీసుకుంది. పీవీ సునీల్ కుమార్ తో ఫైట్ విషయంలో తాజాగా డీజీపీని ఎంటర్ చేశారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

పీవీ సునీల్ కుమార్ పై తాను తాను చేసిన ఆరోపణల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు.. రఘురామ దానిపై వచ్చిన ఓ మీడియా కథనాన్ని చూపిస్తూ గిల్లడం అవసరమా..?

న్యూటన్ నియమం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుందనేది మరిచారా.. లేక, తెలిసే రంగంలోకి దిగారా.. అదీగాక సునీల్ కుమార్ అంత రియాక్ట్ అవ్వరులే.. ప్రభుత్వం మాది కదా అని భ్రమించారా..?

అక్కడితో ఆగకుండా.. పీవీ సునీల్ కుమార్ తల్లి సమాధి ఫోటోలు షేర్ చేస్తూ.. తెలిసీ తెలియకుండా వారి కుల, మత ప్రస్థావన ఎందుకు తెచ్చినట్లు..? ఆ తర్వాత ఎందుకు అభాసుపాలైనట్లు..?

పైగా గట్టిగానే పోరాడతారు అనే పేరు సంపాదించుకున్న రఘురామ… పీవీ సునీల్ కుమార్ పై డీజీపీకి ఫిర్యాదు చేయడాన్ని.. పలువురు పలాయనం చిత్తగించడంగా భావించే ప్రమాదం లేదా..?

ఏది ఏమైనా సునీల్ కుమార్ పై డీజీపీకి రాసిన తన లేఖను పోలీసులు, ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోతే.. మీ పరువు ఏమి గానూ అని ఎవరైనా అడిగితే..?

గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ కస్టడీలో తనను హింసించారని ఆరోపిస్తూ.. పీవీ సునీల్ పై ఫిర్యాదు చేసిన రఘురామ కృష్ణమ్రాజు శ్రమ ఫలించిందనే చెప్పాలి! ఇటీవల ఆయన కేసు వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ గ్యాప్ లో రఘురామ కృష్ణంరాజుకు.. బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు షాకిచ్చింది! దీంతో ఈ కేసులో ఆయనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీవీ సునీల్ సోషల్ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని 420 అని అంటూ.. ఇది తన వ్యక్తిగత ఆరోపణలు కాదని.. సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ లో మోసానికి (420)కి సంబంధించిన సెక్షన్స్ ని కూడా పొందుపరిచారని సునీల్ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో.. దర్యాప్తును తాను ప్రభావితం చేస్తానేమో అనే కారణంతో తనను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజును సైతం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు!

పైగా ఆయన అరెస్ట్ కావడం కన్ ఫా అని.. ఆయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండగా అరెస్ట్ అయితే.. అది రాష్ట్రానికి, రాష్ట్ర రాజధానికి ఏమాత్రం మంచిది కాదని.. అందరి పరువూ పోతుందని సునీల్ పరోక్షంగా ప్రభుత్వ పెద్దలకు హెచ్చరికలు కమ్ సూచనలు చేశారు! ఈ నేపథ్యంలో తట్టుకోలేకో, ఎదురు సమాధానాలు చెప్పలేకో తెలియదు కానీ.. రఘురామ రూటు మార్చారనే చర్చ మొదలైంది.

ఈ సందర్భంగా.. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలను ఉల్లంఘించి తనపై సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతున్న పీవీ సునీల్ కుమార్ ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు తాజాగా డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారు. ఇందుకు ఆధారంగా పీవీ సునీల్ ‘ఎక్స్’ లో పెట్టిన పోస్టులు, వీడియోల్ని సమర్పించారు. దీంతో వ్యవహారం మరింత చచనీయాంశంగా మారింది.

అయితే ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. వారిద్దరి మధ్య ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న వార్ మధ్యలో డీజీపీకి ఫిర్యాదు చేయడం సరే కానీ.. దీనిపై డీజీపీ చర్యలు తీసుకోని పక్షంలో, కనీసం సునీల్ ని పిలిపించి మాట్లాడటమో, మందలించడమో చేయని నేపథ్యంలో.. రఘురామ పరువు పోయినట్లవుతుందని అంటున్నారు. ఇది ఆయనకు ప్రభుత్వంలో అత్యంత దయణీయమైన పరిస్థితి ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతుందని అంటున్నారు.

అలా కాకుండా… రఘురామకృష్ణంరాజు రాసిన లేఖకు, ఇచ్చిన ఫిర్యాదుకు, చేసిన సూచనలకు డీజీపీ స్పందించి.. పీవీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకుంటే మాత్రం… ఏపీ ప్రభుత్వంలో రఘురామ ఎప్పుడూ రాజే అనే అభిప్రాయానికి జనం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. తాజా మలుపు రఘురామకృష్ణంరాజుకి ప్రిస్టేజ్ ఇష్యూ అని చెబుతున్నారు. మరి రిజల్ట్ ఏమిటనేది వేచి చూడాలి!

దీనికి కౌంటర్ గానో ఏమో తెలియదు కానీ… “ఉత్తరాల ఉత్తర కుమారుడికి ఎవడూ భయపడడు ఆ ఉత్తరం చదివి సరైన సమాధానం చెబుతా… వెయిట్ అండ్ సీ” అని ఎక్స్ లో ఓ నర్మగర్భ పోస్ట్ పెట్టారు సునీల్ కుమార్.

శివాజీ దూల | Journalist Bharadwaj Fires On Actor Shivaji Comments On Heroines | Anchor Sravanthi |TR