రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఇప్పుడు జగన్ కి ఢిల్లీలో పెద్ద పీఠ వేయబోతుందా? జగన్ మద్దతు కోసం జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయా? అంటే అవుననే చెబుతోంది ఓ సన్నివేశం. త్వరలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీ బరిలో ఎన్డీఏ..యూపీఏ లున్నాయి. చైర్మన్ పదవి కోసం రెండు పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు కూటములకు సొంతంగా బలం లేదు. రెండు పార్టీలు ఇతర పార్టీల మీద ఆధారపడి నెగ్గించుకోవాల్సిందే. ఎన్డీయే లో తమ అభ్యర్ధిగా కూటమిలోని జేడీయూ నుంచి పోటికి దింపుతున్నారు. ఇక యూపీఏ నుంచి నేరుగా సోనియాగాంధీ బరిలో ఉన్నారు.
ఓ రకంగా చెప్పాలంటే ఈ ఎన్నిక రసవత్తరంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. యూపీయేతర, ఎన్డీయేతర పార్టీలంటే వైసీపీ, టీఆర్ ఎస్, బీజేడీ వంటివి ఉన్నాయి. పార్లమెంట్ లో జగన్ కు ఉభయ సభలు కలుపుకుని ఏకంగా 28 ఎంపీల మద్దతుంది. రాజ్యసభలోనే ఆరుగురు ఎంపీలున్నారు. కాబట్టి జగన్ అవసరం డిప్యూటీ ఎన్నికకు అత్యంత అవసరమనే చెప్పాలి. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ జగన్ కి ఫోన్ చేసి మద్దతడినట్లు సమాచారం. ఎన్డీయేకి రాజ్యసభలో బిల్లులు గట్టాక్కాలంటే జగన్ మద్దతు అంతే కీలకం. దీంతో ఇప్పుడు జగన్ కి డిమాండ్ పెరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే యపీయే కూటమి జగన్ మద్దతడగడానికి రెడీ అవుతున్నట్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ యూపీఏకు ఎలాగూ మద్దతివ్వరన్నది బహిరంగమే. కాబట్టి ఎన్డీయే ముందు జగన్ తన చిన్న చిన్న డిమాండ్ల ఉంచితే నెరవేరే అవకాశం లేకపోలేదు కదా! అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకొస్తుంది. మరి ఈ అవకాశాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ విథేయుడిగా జగన్ నడుచుకుంటోన్న సంగతి తెలిసిందే.