ఫిరాయింపులకు తగిన శాస్తే జరిగింది

అవసరానికి వాడుకుని వదిలేయటంలో చంద్రబాబునాయుడును మించినోడు ఎక్కడా లేడు.  ఆ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఫిరాయింపుల విషయంలో మరోసారి స్పష్టమైంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించారు. ఫిరాయించారంటే ఊరికే ఏమీ వెళ్ళలేదులేండి. ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు చంద్రబాబు నుండి భారీ తాయిలాలను అందుకుని మరీ ఫిరాయించారు.

కోట్ల రూపాయలు తీసుకుని కొందరు, కాంట్రాక్టులు తీసుకుని మరికొందరు, అప్పులు తీర్చుకుని ఇంకొందరు ఇలా..అందరూ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసే వెళ్ళిపోయారు. అలాంటిది ఇపుడు ఫిరాయింపుల్లో కొందరు చంద్రబాబు తమను మోసం చేశాడని లబోదిబోమంటున్నారు. ఎందుకంటే, వాళ్ళకి టికెట్లివ్వలేదట. తమకు టికెట్ల విషయంలో హామీ ఇచ్చి ఇపుడు మాట తప్పారట.  

విచిత్రంగా లేదూ ఫిరాయింపుల మాటలు. నమ్మి టికెట్లిచ్చి గెలిపించుకున్న వైసిపిని మోసం చేసి టిడిపిలోకి ఫిరాయించిన వాళ్ళు కూడా చంద్రబాబు మోసం గురించి మాట్లాడుతున్నారు. ఫిరాయింపులు జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తే, చంద్రబాబు ఫిరాయింపులను మోసం చేశారు అంతే. ఇపుడు కూడా చంద్రబాబు టికెట్లివ్వలేదు కాబట్టి మళ్ళీ బుట్టారేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి  వైసిపిలో చేరారు. వీళ్ళకే గనుక టికెట్లిచ్చుంటే…