స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గురువారం సాయంత్రం స్కిన్ అలర్జీతో బాదపడుతున్నారని కథనాలొచ్చ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజమండ్రి జీజీహెచ్ నుంచి వైద్యులను పిలిపించిన జైలు అధికారులు ట్రీట్ మెంట్ ఇప్పించారు. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ వచ్చిందని, వైద్యులు మందులు ఇచ్చారని తెలిపారు. అనంతరం గురువారం చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి మరో హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.
గురువారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల అనంతరం… శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రచారం చేశారు. ఎవరికి తోచిన గాసిప్స్ వారు వండివార్చారు. ఈ సమయంలో ప్రభుత్వంపైనా, పోలీసులపైనా బురద జల్లే ప్రయత్నం చేశారు. దీంతో జైళ్ల శాఖ అధికారులు సీరియస్ అయ్యారు.
దీంతో… కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ, స్థానిక ఎస్పీతోనూ, రాజమండ్రి జీజీహెచ్ వైద్యులతోనూ ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంపై రచ్చ రచ్చ జరిగిన నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు తెలిపారు. అసలు జైల్లో నాలుగు గోడల మధ్య ఉన్న వ్యక్తి, చీమకు కూడా చూడటానికి ఛాన్స్ లేనటువంటి గురించి ఎందుకు ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైరయ్యారు!
ఇకపై తప్పుడు వార్తలు ప్రచురించినా, సోషల్ మీడియాలో బాబు ఆరోగ్యం గురించి తప్పుడు పోస్టులు పెట్టినా చర్యలు తప్పవని తమదైన శైలిలో విచరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రెండో రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై కొంతమంది చేసిన అసత్య ఆరోపణలపై జైలు అధికారులు, స్థానిక ఎస్పీ క్లారిటీ ఇచ్చారు.
ఇందులో భాగంగా… తమ దగ్గర చంద్రబాబు ఒక రిమాండ్ ఖైదీ మాత్రమే అని గుర్తుచేసిన అధికారులు.. కోర్టు సూచనల మేరకు హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తున్నామని, తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని అన్నారు. ఇక కలుషిత నీటివల్లే బాబుకు స్కిన్ అలర్జీ అని అంటున్నారని, జైలులో 2036 మంది ఖైదీలు ఉన్నారని.. మరి వారికెందుకు రాలేదని ప్రశ్నించారు.
ఇక జైలు లోపల చంద్రబాబు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపిన అధికారులు… చంద్రబాబు భద్రత కోసం ఏడుగురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని చెప్పారు. ఆయనను ఉంచిన బ్యారక్ లోకి ఏ ఇతర సిబ్బందికి ప్రవేశం లేదని తెలిపారు. ఇక చంద్రబాబుకు భోజన సదుపాయం అందించడాన్ని కూడా నిత్యం మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు.
చంద్రబాబు రెండో హెల్త్ బులిటెన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.!
బీపీ: 130/80 (ఫాస్ట్ బులిటెన్ లో 140/80)
టెంపరేచర్: సాధారణం
పల్స్: 84/మినిట్ (ఫాస్ట్ బులిటెన్ లో 87/మినిట్)
హార్ట్: ఏస్1 ఏస్2
లంగ్స్: క్లియర్
ఎస్పీఓ2జీ: 97 శాతం
ఫిజికల్ యాక్టివిటీ: గుడ్