పురందేశ్వరి “డిమాండ్”… సృహ ఉందా అంటూ అమిత్ షా ఫైర్?

ఏపీలో బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచీ దగ్గుబాటి పురందేశ్వరి వైఖరిలో పూర్తి మార్పు వచ్చిందని.. టీడీపీకి అనుకూలంగా ఆమె వ్యవహార శైలి ఉంటుందని.. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే మరిదిగారితో కలవాలని ముచ్చటపడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

దీంతో వెంటనే చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండిస్తుంది అంటూ ట్వీట్ చేశారు పురందేశ్వరి. ఆమెతో పాటు టీడీపీ నుంచి ఇతర పార్టీలనుంచీ బీజేపీలోకి వెళ్లినవారు ఖండించారు. దీంతో… ఒరిజినల్ బీజేపీ నేతలు తప్ప మిగిలిన బీజేపీ నేతలంతా బాబు అరెస్టును ఖండించారనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో నాటి నుంచి పురందేశ్వరి, ఏపీ ప్రభుత్వంపై కక్ష గట్టినట్లు ఉన్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా… ఏపీలో మద్యం అమ్మకాలపైనా, కల్తీ మద్యం అమ్ముతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో… ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చారు. మద్యం క్వాలిటీ నిత్యం చెక్ చేయబడుతుందని, తాను సీఎం అయ్యాక ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీకి కూడా అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ పురందేశ్వరి తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో ఏపీలో మద్యం అమ్మకాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తాజాగా అమిత్ షా ని ఆదివారం కలిశారు పురందేశ్వరి. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ కూడా ఆమె సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్థావించారంట. దీంతో… కేంద్ర హోం మంత్రి అమి షా సీరియస్ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

దీంతో… సొంత ప్రభుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేలా సీబీఐతో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేసిన పురందేశ్వరికి అమిత్‌షా క్లాస్ తీసుకున్నట్టు చర్చ జరుగుతుంది. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు వారి పార్టీని, వారి ప్రభుత్వాన్ని వారు “డిమాండ్” చేయడం ఏమిటని ఆమెపై ఫైరయ్యారని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటికీ గౌరవ స్థానం ఇచ్చినందుకు నిలబెట్టుకోవాలే తప్ప… తామేదో గొప్ప నాయకులం కాబట్టి ఆ విలువ దక్కుతుందని భ్రమిస్తే నష్టం మీకేనని సీరియస్ గా స్పందించారని అంటున్నారు.

ఇదే సమయంలో… సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటాయ‌నే స్పృహ ఉండే, ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థతో విచార‌ణ చేయించాల‌ని “డిమాండ్” చేస్తున్నార అని పురందేశ్వరిని నిల‌దీసిన‌ట్టు తెలుస్తుంది. ప్రభుత్వాలను విపక్షాలు డిమాండ్ చేయాలి కానీ… సొంత పార్టీ నేతలు డిమాండ్ చేయడం ఏమిటని చివాట్లు పెట్టారంట. దీంతో… విషయం అర్ధం చేసుకున్న పురందేశ్వరి సైలంటైపోయారని, సారి చెప్పి బయటకు వచ్చేశారని అంటున్నారు. ఏది ఏమైనా… చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి మనిషి మనిషి గా లేరని, ఆమె మనసు మనసులో లేదని అంటున్నారు పరిశీలకులు!