పోలీసుల అదుపులో గరుడపురాణం శివాజి

విదేశాలకు పారిపోయేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్న గరుడపురాణం శివాజీని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబునాయుడు మద్దతు చూసుకుని నోటికొచ్చినట్లు రెచ్చిపోయారు. తలా తోక లేకుండా జగన్మోహన్ రెడ్డిపై  నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు. గరుడపురాణం అంటూ కథలు చాలానే వినిపించారు.

తెలంగాణా-ఏపి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు. ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబునే గెలిపించాలని జనాలకు పిలుపునిచ్చారు. సరే గరుడపురాణం ఎంత చెప్పినా పట్టించుకోని జనాలు వైసిపిని అఖండ మెజారిటితో గెలిపించారు. రాజకీయాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడిన శివాజీ తనకున్న రాజకీయ దన్ను చూసుకుని చివరకు పోర్జరీ, దొంగ డాక్యుమెట్ల తయారీకి కూడా దిగారు. ఆ కేసులోనే ఇపుడు తగులుకుని అరెస్టయ్యారు.

ఒకవైపు రాజకీయంగా రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తునే మరోవైపు టివి9 యాజమాన్యం బదిలీని అడ్డుకునేందుకు అడ్డదారులెన్నో తొక్కారు. మాజీ సీఈవో రవిప్రకాశ్ తో కలిసి యాజమాన్యం బదిలీ కాకుండా డ్రామాలకు దిగారు. ఈ క్రమంలోనే ఎన్నో దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. కొన్నింటిని పోర్జరీ చేశారు.

సరే వీళ్ళు ఎన్ని డ్రామాలాడినా ఆటలుసాగలేదు. పైడా వీళ్ళ డ్రామాలన్నీ బయటపడిపోయాయి. దాంతో ఇద్దరూ అడ్రస్ లేకుండా మాయమైపోయారు. విచారణ నిమ్మితం పోలీసులు ఎన్ని నోటీసులిచ్చినా లెక్కచేయలేదు. వేరేదారిలేక నెలక్రితం రవిప్రకాశ్ తనంతట తానుగా లొంగిపోయారు.  రెండు నెలలుగా పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్న శివాజీని సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం అరెస్టు చేశారు.