చంద్రబాబునాయుడుకు వారం రోజులే గడువుంది. అవును చంద్రబాబు ఉంటున్న అక్రమనిర్మాణాన్ని కూల్చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అచ్చంగా వారం మాత్రమే గడువుగా పెట్టుకుంది. ఈలోగానే అక్రమనిర్మాణమైన లింగమనేని భవనాన్ని ఖాళీ చేయాలని చంద్రబాబుకు నోటీసు ఇవ్వాలని సిఆర్డిఏ నిర్ణయించింది.
కరకట్టపై అక్రమంగా నిర్మించిన అనేక భవనాల్లో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఒకటి. కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన సుమారు 50 భవనాలను ప్రభుత్వం గుర్తించింది. సదరు భవనాన్ని కూల్చేయబోతున్నట్లు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్ తో పాటు భవనాన్ని ఖాళీ చేయాలంటూ చంద్రబాబుకు ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది.
అక్రమనిర్మాణాల కూల్చివేతలో అందరూ అనుకున్నట్లుగానే జగన్ వ్యవహరిస్తున్నారు. కరకట్టపై అక్రమనిర్మాణాలేవీ ఉండకూడదన్నది జగన్ నిర్ణయం. అందులో భాగంగానే 20 అక్రమనిర్మాణాలు గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేసింది. అక్రమనిర్మాణంలో ఉన్న కారణంగా చంద్రబాబు ఇంటికి నోటీసు అంటించారు.
మొన్నటి ఎన్నికలైన తర్వాత క్యాంపాఫీసును చంద్రబాబు ఖాళీ చేసేసుంటే గౌరప్రదంగా ఉండేది. కానీ అటువంటి పనులు చంద్రబాబు చేయరుకదా ? పైగా తన నివాసం పక్కనే ఉన్న మరో అక్రమకట్టడం ప్రజావేదికను కూడా తనకే కేటాయించాలంటు చంద్రబాబు రాసిన లేఖతో కంపు మొదలైంది.
సిఎంగా ఉండగానే మామూలు జనాలను ఎవరినీ కలవని చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత జనాలను కలుస్తానంటే నమ్మేంత పిచ్చోళ్ళెవరూ లేరు. అందుకనే ముందుగా ప్రజావేదికను ప్రభుత్వం కూల్చేసి ఇపుడు చంద్రబాబు నివాసాన్ని టార్గెట్ చేసుకుంది.