ఆంధ్రప్రదేశ్‌లో భయపెడుతోన్న కరోనా కేసులు!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తోంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 81 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా అత్యధికంగా కృష్టా జిల్లాలో 51 కేసులు నమోదు కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిర్దారణ పరీక్షలు పెంచడం వల్లే ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఉదయం 9 దాటిన తర్వాత ఇక ప్రజలు బైటికి రాకుండా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా విజయవాడలో లాక్ డౌన్ నిబంధనలను కఠిన తరం చేశారు. అలాగే కర్నూలు జిల్లా పెద్దపాడు మార్కెట్ వ్యవహారంపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు ఐదు చోట్ల మార్కెట్లు ఏర్పాటుపై ఆదేశాలు వ చ్చాయి. ఇక గుంటూరు జిల్లాలో సైతం పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి ప్రజలను రోడ్లపై తిరగకుండా చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సైతం కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

అయితే ఇలాంటి చర్యలు ప్రభుత్వం ముందుగా చేపట్టి ఉంటే పాజిటివ్ కేసులు ఇంత ఎ క్కువగా పేరిగేవి కావన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి మే 3వ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తే వాటి ఫలితాలు ఎప్పటికి వస్తాయో.. !