AP: వైయస్ జగన్ ను అరెస్టు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు?

AP: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి వారిని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే ఇలా వైసిపికి చెందిన కీలక నేతలందరినీ కూడా అరెస్టు చేస్తూ వారిని జైలు గోడల మధ్య ఉంచుతున్నారు ఈ క్రమంలోనే మరి కొంతమంది కీలక నేతలు కూడా అరెస్టు కాబోతున్నారంటూ ఇప్పటికే కూటమి నేతలు హింట్ ఇస్తున్న విషయం తెలిసిందే.

జగన్మోహన్ రెడ్డి అరెస్టు ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీలో లేని లిక్కర్ స్కాం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని.

ఇప్పుడు తనని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లను తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్ ను ముద్దాయిని చేయాలని చూస్తున్నారన్నారు.. ఏదో ఒక రకంగా జగన్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశ్యమే వారిలో కనిపిస్తోందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపి గూటికి చేరి చిలక పలుకులు పలుకుతున్నారని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ పేరు లేకపోయినా.. ఎవరి పేరు మీద మీరు పెట్టుబడులు పెట్టారో మీ అంతరాత్మను తెలుసన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగాయని మీరు అనుకుంటున్నారో అప్పుడు మీరు వైసీపీలోనే ఉన్నారని పేర్ని నాని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ఎంపి బాబు స్కిల్స్ కామ్ గురించి కూడా మాట్లాడాలి కదా అంటూ ప్రశ్నించారు. గతంలో డిస్టలరీలకు చెల్లించిన రేటెంత.. ఇప్పుడు చెల్లిస్తున్న రేటెంత..అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపై ప్రశ్నల వర్షం కురిపించారు పేర్నినాని.. ఇవాళ మద్యం షాపులను వచ్చిన వారి దగ్గర నుంచి బెదిరించి లోబరచుకున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు.