రాహుల్ వదిలేశాడు సోనియమ్మ తీసుకుంది
సార్వత్రిక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ అన్యాయమై పోయింది . పార్టీ ఘోర పరాజయానికి నైతిక భాద్యత తాను వహించి అధ్యక్షత బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఎప్పటినుంచో రాహుల్ గాంధీ చెబుతున్నాడు . అయినా వర్కింగ్ కమిటీలో లో వున్న పెద్దలు అతన్ని వారిస్తూ వస్తున్నారు . అయినా రాహుల్ పార్టీకి నాయకత్వం వహించానని చెప్పేశాడు .
భారతీయ జనతా పార్టీ ప్రజల్లో విశ్వాసం పోగొట్ట్టుకుందని , ముఖ్యంగా ప్రధాని నరేద్ర మోడీ చేసిన పనులవల్ల మళ్ళీ గెలిచే అవకాశం లేదని , కాంగ్రెస్ పార్టీతో పాటు ఆపార్టీ నాయకుడు రాహుల్ గాంధీని అమితంగా నమ్మిన మిగతా పార్టీలు కూడా అదే నమ్మకాన్ని వ్యక్తం చేశాయి . పార్టీకి , ప్రతి పాకేతాలకు మరింత బలం పెంచడానికి ప్రియాంక గాంధీని కూడా రంగంలోకి దించాయి . భారతీయ జనతా పార్టీ ని అమిత్ షా , నరేంద్ర మోడీ నడిపించారు . కాంగ్రెస్ పార్టీని , దాని నాయకుడు రాహుల్ గాంధీని ప్రతి పక్షాలు నడిపించాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎవరు ఊహించని విధంగా 300 సీట్లకు పైగా స్వంతంగా గెలుచుకుంది . కాంగ్రెస్ కు ఊహించని పరాజయం కలిగింది . అప్పటి నుంచి రాహుల్ అధ్యక్షుదుగా ఉండనని భీష్మించుకున్నాడు .
శనివారం రోజు న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఎన్నుకున్నారు . రాహుల్ గాంధీ రాజీనామా చేశాడు . కాంగ్రెస్ పార్టీ బరువు మోయజాలనని , తన ఆరోగ్యం కూడా సహకరించడం లేదని సోనియా గాంధీ అధ్యక్షత బాధ్యతలను కొడుకు రాహులకి అప్పగించింది . అయితే ఈ మూడు నెలల్లో నరేంద్ర మోడీ చేసిన పనులకు ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ , కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు లాటివి ఆయన ఇమేజీని అమాంతంగా పెంచాయి . ఇక లాభంలేదని రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని .. తన అసమర్ధత అనే సందేశాన్ని దేశ ప్రజలకు అందించాడు . ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సోనియా గాంధీయే దిక్కాయ్యారు .