బాబు సమర్ధతపై కేవీపీ సంచలన వ్యాఖ్యలు!

బహిరంగ వేదికలపైనా, ప్రెస్ మీట్లలోనూ అతి తక్కువగా మాట్లాడతారు కానీ… మాట్లాడితే మాత్రం కనిపించని వెటకారంతో చెడుగుడు ఆడేసుకుంటారు కేవీపీ రామచంద్రరావు. పైకి సీరియస్ గా కనిపించే కేవీపీ లో ఇంత హ్యూమర్ ఉందా అటు జర్నలిస్టు సర్కిల్స్ లోనూ – ఇటు ఆయనతో పరిచయం ఉన్న పొలిటీషియన్స్ చర్చల్లోనూ డిస్కషన్స్ నడుస్తుంటాయి. ఈ క్రమంలో… చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేవీపీ… తాజాగా చంద్రబాబుపై తనవైన సేటర్స్ వేశారు. సీరియస్ ఇష్యూలనే ఫన్నీగా గా చెబుతూ… బాబుకు స్లోగా దింపారు!

అవును… రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంపై ఏపీలో రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ తవ్వించిన కాల్వల నుంచి నీరు పారించి.. మొత్తం తానే చేశానని చెప్పుకునే ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.

ఇక తాను జాతీయస్థాయిలో రాజకీయ చక్రాలు గట్రా తిప్పానని చెప్పుకునే చంద్రబాబు… రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏపీలో మురికి కాల్వల్లో అవినీతి గురించి మాట్లడడానికే చంద్రబాబు పరిమితం కాకూడదని.. ఇకనైనా ఢిల్లీకి వచ్చి తనస్థాయి పోరాటాలు చేయాలని సున్నితంగా సూచించారు.

ఇదే సమయంలో చంద్రబాబుకు మాత్రమే సాధ్యమయ్యే కొన్ని అపురూప ఘట్టాలపై స్పందించిన కేవీపీ… అవన్నీ బాబు గొప్పతనానికి, టాలెంట్ కు నిదర్శనాలని కొనియాడారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు కేవీపీ. “ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ ఏపీకి మరణశాసనం రాసిన చంద్రబాబు… ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేశారు.. అలా చేయడం చంద్రబాబుకే సాధ్యమైంది” అని కేవీపీ మండిపడ్డారు.

ఇక 2016లో రాహుల్ గాంధీ మీద రాళ్లు వేయించిన చంద్రబాబు, 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని… స్టేజ్ పైకి ఎక్కి చేతులు ఊపారని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కోసం 1984లో పోరాటం చేసిన బాబు, అదే ఎన్టీఆర్‌ ను పార్టీ నుంచి బయటకి పంపించేశారని.. ఇప్పుడు మరలా ఆయన ఫోటోకే దండలు వేసి పొగుడుతుంటారని… చంద్రబాబు దేనికైనా సమర్థుడని ఎద్దేవా చేశారు.

Congress Leader KVP Ramachandra Rao Sensational Comments On Chandrababu@SakshiTV