విజయసాయిరెడ్డి .. వైసీపీ లో సీఎం జగన్ తర్వాత అంతటి పవర్ ఉన్న కీలక నేతల్లో ఒకరు. అయితే , ఆదంతా ఒకప్పటి మాట , ఇప్పుడు అయనను చూసి పంచలు తడుపుకునే ప్రతిపక్ష నేతలు లేరా అంటే , ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది. 2015లో వచ్చిన విజయసాయిరెడ్డి వైసీపీకి ఎన్నో ఘన విజయాలు అందించారు. ఆయన వచ్చాకనే పార్టీ గాడిన పడింది. 2019 ఎన్నికల్లో విశాఖలో సిటీలో నాలుగు తప్ప రూరల్ జిల్లా అంతా కలిపి 11 సీట్లను వైసీపీ పరం చేయడంతో విజయసాయిరెడ్డి ప్రముఖ పాత్ర వహించారు.
అయన రూరల్ వరకూ బాగానే వైసీపీని తీర్చిదిద్దినా సిటీలో మాత్రం ఆయన టీడీపీని దెబ్బతీయలేకపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది కుదరటం లేదు. యన విశాఖలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. అందులో సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జై కొట్టారు. గంటా శ్రీనివాసరావు, గణబాబు సైలెంట్ అయ్యారు. కానీ వెలగపూడి రామక్రిష్ణ బాబు మాత్రం ఏకంగా విజయసాయిరెడ్డికే సవాల్ చేశారు. దీనితో ఆ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే వైసీపీ లో ఉండే లుకలుకలు కూడా ఆయనకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఉత్తరాంధ్రాలోని నేతలకు సామాజిక వర్గాల పరంగా ఉన్న సాన్నిహిత్యం పార్టీలను దాటి ముందుకు సాగుతుంది. దాంతో అటూ ఇటూ కూడా విజయసాయిరెడ్డికి శత్రువులు పెరిగారు. ఈ పరిణామంతో ఆయన వైసీపీని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనే విమర్శలు వినపడుతున్నాయి. విశాఖకు వలస వచ్చిన విజయసాయిరెడ్డి వీసా అయిపోయింది ఇక పెట్టే బేడా సర్దుకోవచ్చు అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. చుడాలిమరి విజయసాయిరెడ్డి విశాఖ లో మళ్లీ ఎలా పూర్వవైభవం దక్కించుకుంటారో..