పవన్ కళ్యాణ్‌పై తుస్సుమన్న వైసీపీ ప్రాసిక్యూషన్.!

ఓ వాలంటీరు, ఓ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా కేసులు పెట్టేంత రిస్క్ తీసుకోవడం సాధ్యమేనా.? ఏం ఎందుకు కాకూడదు.. ఇది ప్రజాస్వామ్యం.! అయినాగానీ, అది అంత తేలిక కాదు.!

మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కోర్టుల్ని ఆశ్రయించడం మొదలు పెడితే, వందల్లో, వేలల్లో కాదు.. లక్షల్లో, కోట్లల్లో కేసులు నమోదవుతుంటాయి అను నిత్యం.! వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నది ఓ ఆరోపణ. వాలంటీర్ల ద్వారా సేకరిస్తోన్న ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమవుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించిన మాట వాస్తవం.

రాజకీయాల్లో ఆరోపణలు సహజం. పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్‌గా అభివర్ణించడం కూడా ఓ ఆరోపణే. ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయ్.. అని పవన్ కళ్యాణ్ అభిమానులు కోర్టుల్ని ఆశ్రయిస్తే’ కుదురుతుందా.?

ఇక, విజయవాడకు చెందిన ఓ వాలంటీర్, తన మనోభావాలు దెబ్బతిన్నాయనీ, మానసిక వేదనకు గురయ్యాననీ, పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ మహిళా వాలంటీరు ఫిర్యాదుని న్యాయస్థానం తిప్పి పంపింది. అంటే, ఆమెతో ఫిర్యాదు చేయించిన వైసీపీకి ఇది చెంప పెట్టులాంటి వ్యవహారమే కదా.!

ఇక, ప్రభుత్వం కూడా.. పవన్ కళ్యాణ్ మీద ప్రాసిక్యూషన్ కోసం ఇటీవల జీవో జారీ చేసింది. ఆ ప్రాసిక్యూషన్ ఏమవుతుందో, విజయవాడ వాలంటీర్ కేసుని పరిశీలిస్తే తేటతెల్లమైపోతుంది. ఈ తరహా తొందరపాటు చర్యలు, వైసీపీ స్థాయిని దిగజార్చుతాయి.