AP: కూటమి ప్రభుత్వ తీరుపై వైకాపా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఎన్నికలకు ముందు ప్రజలందరినీ మభ్యపెడుతూ దొంగ హామీలను ఇస్తూ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇలా తమ మాయమాటలతో ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు అంటూ అమర్నాథ్ వెల్లడించారు.
తాము పెద్ద ఎత్తున అప్పులు చేసి అధికారం నుంచి దిగిపోయామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇన్ని అప్పులు ఉన్నప్పుడు నేను చెప్పిన హామీలు ఇవ్వడం అసాధ్యం అవుతుందన్న విషయం ఆయనకు తెలియదా? కేవలం ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే దొంగ హామీలన్నింటిని ఇచ్చి ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన గొప్ప పథకాలను అందించారు అయితే ఇప్పుడు ఆ హామీలు ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటూ నిందలు మాపై వేస్తున్నారు.
మా ప్రభుత్వంలో ఎంత అప్పు ఉంది మీరు దిగిపోయిన నాటికి ఎంత అప్పు ఉందనే విషయాన్ని స్వయంగా మీ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. మీరు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే రూ.1.12 వేల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టబోమని గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు..
చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను ఇవ్వకుండా ప్రజాధనాన్ని మొత్తం అమరావతిలోనే పోస్తున్నారని అక్కడ తమ సామ్రాజ్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నారని తెలిపారు. ఈ స్థాయిలో అప్పులు చేసే ఒక అమరావతిలోనే అభివృద్ధి చేస్తే మిగిలిన ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రజలు ఏమైపోయినా మీకు పట్టదా అంటూ కూటమి నేతలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.