యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైద్య ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా ఆశాకిరణం అందించారు.
ఈ సందర్భంగా మొత్తం 50 మందికి రూ. 36,05,928/- విలువైన చెక్కులు, బీమా సాయాన్ని పంపిణీ చేశారు. అందులో 46 మందికి రూ. 26,05,927/- చెక్కులు అందించగా, ముగ్గురికి LOCలు, మరో ఇద్దరికి ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎరిక్షన్ బాబు గారు, “ఆపదలో అండగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధి. ప్రతి ఒక్కరూ ఈ సాయాన్ని మరువకుండా ఉపయోగించుకోవాలి. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు గారికి తెలియజేసి, సహాయం అందించడమే నా కర్తవ్యం” అని అన్నారు.
అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల చూపుతున్న మానవతా దృక్పథానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

