జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని కొంతమంది ప్రేక్షకులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తారక్ సీఎం అయితే చూడాలని ఉందని తారక్ సీఎం కావడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని వాళ్లు భావిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి బాలేదు. చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి ముందుకు నడిపించే వ్యక్తి ఎవరనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ అవుతున్నారు. తారక్ రాజకీయాల్లోకి వస్తే తాము సపోర్ట్ చేస్తామని ఇతర పార్టీల రాజకీయ నాయకులు సైతం చెబుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయాలని భావించే వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డు పెట్టుకుని విమర్శలు చేయడం ప్రస్తుత్న హాట్ టాపిక్ అవుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
తారక్ రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పొలిటికల్ గా తారక్ సక్సెస్ కావడం కష్టం కాదని అయితే సరైన సమయంలో ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాల్లో ఊహించని సక్సెస్ లో సక్సెస్ అయిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారేమో చూడాలి. అయితే నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రం తారక్ రాజకీయాల్లోకి రాకూడదనే భావన ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా తారక్ ఈ సమయంలో రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు. రాజకీయాలకు సంబంధించి తారక్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.