ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోంది. ర్యాలీలు, రోడ్ షోల విషయంలో జగన్ సర్కార్ కొత్త మార్గదర్శకాలను ప్రకటించగా ఆ మార్గదర్శకాల అమలు ఇప్పటికే మొదలైంది. చంద్రబాబు కుప్పం పర్యటనకు అనుమతులు తీసుకోవాలని పోలీసులు కుప్పం టీడీపీ నేతలకు సూచనలు చేశారని సమాచారం అందుతోంది. అయితే బాబు పర్యటనకు ఆంక్షలు విధించడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
లోకేశ్, పవన్ కళ్యాణ్ యాత్రలకు సైతం ఇకపై ఇవే నిబంధనలు అమలులోకి రానున్నాయని తెలుస్తోంది. పవన్, లోకేశ్ యాత్రల నిషేధం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. 2024 ఎన్నికలకు మరో 14 నెలల సమయం ఉంది. టీడీపీ, జనసేన ప్రజలకు దగ్గర కావడం కోసం పాదయాత్ర, ఇతర యాత్రల దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ల యాత్రలకు అనుమతులు లభించడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అధికార పక్షానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిబంధనలు అమలు కానున్నాయని సమాచారం అందుతోంది. చంద్రబాబు చేసిన పాపం పవన్ కు శాపమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్లాన్లకు జగన్ బ్రేక్ వేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. వారాహి యాత్రకు జగన్ భారీ షాకులిచ్చే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. అన్ని పార్టీలకు ఈ నిబంధనలు అమలవుతాయని వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా వాస్తవంగా మాత్రం ఏం జరుగుతుందో అందరికీ తెలుసని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే దెబ్బకు చంద్రబాబు, లోకేశ్, పవన్ లకు జగన్ చెక్ పెట్టారనే చెప్పాలి.