చంద్రబాబు కాదు, నారా లోకేష్ అసలే కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే.! 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ – జనసేన పార్టీల తరఫున పవన్ కళ్యాణ్ పేరు ప్రముఖంగా తెరపైకొస్తోంది.
కానీ, అందుకు తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా.? ఒప్పుకోక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా పడింది. పడుతుందనీ, చంద్రబాబుకి తెలుసు.. టీడీపీకి కూడా తెలుసు.
చంద్రబాబు బెయిల్ విషయమై టీడీపీ అంత సీరియస్‌గా కనిపించడంలేదు. ‘క్వాష్’ దిశగానే టీడీపీ ఆలోచనలు సాగుతున్నాయి. ‘క్వాష్’ ఎప్పటికి జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. సర్వోన్నత న్యాయస్థానంపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. కానీ, ఏ న్యాయస్థానమైనా విచారణ ఆపెయ్యమని అనదు కదా.? అన్నది న్యాయ నిపుణుల వాదన.
ఎన్నాళ్ళు చంద్రబాబు కేవలం రిమాండ్ ఖైదీగానే జైల్లో వుంటారు.? అంటే, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఏడాదిన్నర జైల్లో వున్నారు.. రిమాండ్ ఖైదీగానే. అయితే, అప్పట్లో ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. పైగా, చాలా కేసులు.
చంద్రబాబు విషయం అలా కాదు. డబ్బులు ఎక్కడికి పోయాయన్నదానిపై ‘సోర్స్’ లేదు. ఇంకా విచారణ చేస్తున్నాం.. అని సీఐడీ చెబితే, న్యాయస్థానాలు ఎక్కువ కాలం ఆ వాదనలతో ఏకీభవించవు. ఇవన్నీ చూస్తోంటే, చంద్రబాబు త్వరలో జైలు నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత అసలు సింపతీ డ్రామా మొదలవుతుంది.
ఈలోగా పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చి, టీడీపీ తన ట్రేడ్ మార్క్ వెన్నుపోటు రాజకీయానికి తెరలేపనుండడం ఖాయం.