వైసీపీలో అన్న మీద తిరగబడిన చెల్లెలి కథ ఇది 

YSRCP explanation on Razole loss 
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని అధికార పార్టీ నాయకుల నడుమ నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నా విబేధాలు భగ్గుమంటున్నాయి.  ఇన్నాళ్లు సందర్భం రాలేయూద్ కాబట్టి ఒకరి మీద ఒకరు పైచేయి సాధించే ప్రయతనం చేయలేదు నాయకులు.  కానీ ఇప్పడు అవకాశం, అవసరం రెండూ వచ్చాయి.  ఎవరికివారు తమ వర్గాలను కాపాడుకునే తాపత్రయంలో ఢీ అంటే ఢీ అంటున్నారు.  దీంతో విస్తుపోవడం పార్టీ శ్రేణుల వంతవుతోంది.  తాజాగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కుటుంబంలోనే ఈ విబేధం బయటపడింది.  ఆయనకు ఎదురుతిరిగింది మరెవరో కాదు స్వయనా చెల్లెలు కావడం గమనార్హం.  రాజకీయంగా కోటగిరి కుటుంబానికి మంచి పేరుంది.  కోటగిరి విద్యాధరరావు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి వారసులకు అందించి వెళ్లారు. 
 
Clashes in Kotagiri Sidhar family 
Clashes in Kotagiri Sidhar family
కోటగిరి శ్రీధర్ సైతం రాజకీయాల్లో మచ్చ అనేది లేకుండా జాగ్రత్తగానే ఉంటున్నారు.  గత ఎన్నికలకు ముందు శ్రీధర్ ఆయన సోదరి పొన్నాల అనిత ఇద్దరూ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  గతంలో అనిత సర్పంచ్ పదవిలో ఉండగా ఆమెకు టీడీపీ నుండి పిలుపు వెళ్ళింది.  పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామన్నట్టు వార్తలొచ్చాయి.  కానీ అనిత మాత్రం సోదరుడి వెంటే ఉంది వైసీపీ కండువా కప్పుకున్నారు.  దీంతో ఏలూరులో కుటుంబం ఇంకా బలపడింది.  అయితే తాజాగా పంచాయతీ ఎన్నికల్లో విబేధాలు పొడచూశాయి.  అనిత ఈసారి కూడ సర్పంచ్ పదవికి పోటీ చేయాలని భావించారు.  పోటీలో ఆమె ఉంటే తప్పక గెలుస్తారు.  పార్టీ మద్దతు కూడ ఆమెకు అవసరం లేదు.  సొంత ఇమేజ్ ఉంది ఆమెకు.  
 
కానీ శ్రీధర్ మాత్రం చిన్నాన్న కుమారుడు కోటగిరి కిషోర్ కుమారుడైన కోటగిరి  సాయిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు.  అతని గెలుపు కోసం అన్నీ దగ్గుతుంది చూసుకుంటున్నారు.  కోటగిరీలోనే మకాం వేసి శ్రేణులను నడిపిస్తున్నారు.  అన్న ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం అనితకు ససేమిరా నచ్చలేదు.  హైదరాబాద్లో ఉన్న ఆమె హుటాహుటిన కోటగిరి చేరుకున్నారు.  చేరుకోవడమే తరువాయి తన అనుచరులను పోగుచేసి మీటింగ్ పెట్టారట.  అన్నయ్యతో మాట్లాడి తేల్చుకుందామని ప్రయత్నం కూడ చేయలేదట.  ఇలా కనీసం సర్దుబాటు మంతనాలు కూడ లేకపోవడంతో గొడవ పెద్దదేనని అనుకుంటున్నారు గ్రామస్తులు. 
 
లోకల్ నాయకుల మాటల మేరకు అనిత ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పంచ్ పదవికి పోటీలో నిలబడలని భావిస్తున్నారట.  ఆమె గనుక నిలబడితే కోటగిరి గ్రామస్తులకు అగ్ని పరీక్షే అవుతుంది.  అన్నను కాదని చెల్లిని గెలిపించాలా లేకపోతే అన్న మాటకు విలువ ఇచ్చి సోదరిని ఓడించాలా అనే సందిగ్ధంలో పడే అవకాశం ఉంది.  ఏది ఏమైనా ఒకరు గెలిస్తే ఇంకొకరి అహం దెబ్బతినడం ఖాయం.  చివరికి ఇన్నాళ్లు కలిసి ఉన్న కుటుంబం రెండు ముక్కలవుతుందా అనేలా తయారైంది పరిస్థితి.