800మందికి సీఐడీ నోటీసులు… తెరపైకి మార్గదర్శి బ్లాక్ మనీ?

సాధారణంగా చిట్టీలు మధ్యతరగతి, దిగువ మద్యతరగతి వారు వేస్తుంటారని అంటుంటారు. ఈ సమయంలో ఎవరి వద్దనైనా కోటి రూపాయలు ఉంటే.. వెంటనే ఆ సొమ్ముతో ఏమి చేస్తారు? భూమి కొనడం, ఇల్లు కొనడం, జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వంటివి చేస్తుంటారని సమాధానం రావొచ్చు!

అయితే అదే కాదు… కోటి రూపాయలు ఉంటే జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కాకుండా మార్గదర్శిలో డిపాజిట్ చేసేవాళ్లు కూడా ఉంటారు! అవును… ఇప్పుడు ఏపీ సీఐడీ అధికారులు ఆ లిస్టే బయటకు తీశారు.. వారందరికీ ఒకసారి వచ్చి కనిపించమని నోటీసులు పంపించారని తెలుస్తుంది!!

అవును… మార్గదర్శిలో నల్లధనం డిపాజిట్ల డొంకంతా కదులుతోందంటూ వస్తున్న కథనాలకు బలం చేకూరే సంఘటనలు తాజాగా తెరపైకి వచ్చాయని తెలుస్తుంది. మార్గదర్శి చుట్టూ “నల్ల”ని చీకట్లు కమ్ముకుంటున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా… మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ సీఐడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలని సమయం, తేదీ, ప్లేస్‌తో స‌హా నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది.

అయితే ఇలా తమ ఖాతాదారులకు సీఐడీ నోటీసులు ఇవ్వటంపై రామోజీరావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారంటూ వస్తున్న కథనాల సంగతి కాసేపు పక్కనపెడితే… మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసినవాళ్ళు మొత్తం సుమారు 800 మంది… త్వరలో సీఐడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుందని మాత్రం స్పష్టమవుతుంది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే… మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే సంస్థ కేవలం చిట్టీలు మాత్రమే వేయాలి కానీ.. ఎవరి నుండి డిపాజిట్లు సేకరించ‌కూడ‌దు. అలా చిట్టీల ద్వారా సేకరిస్తున్న డబ్బును కూడా జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. ఇదే సమయంలో చిట్టీల వ్యాపారంలో వచ్చిన డబ్బును చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు.

ఈ విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికి కొన్ని వందల సార్లు మైకులముందు చెప్పారు! అయితే రామోజీ మాత్రం వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారని తెలుస్తుంది. ఇలా మార్గదర్శిలో డిపాజిట్లు చేసిన వారిలో ఫస్ట్ లిస్ట్ లో కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారి లిస్ట్ మొత్తం తీస్తే సుమారు 800 మంది తేలారని అంటున్నారు. వీద్మో వీల్లందరికీ సీఐడీ నోటీసులు పంపించింది.

దీంతో… అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో కాకుండా కేవలం మార్గదర్శిలో మాత్రమే కోటి రూపాయలు ఎందుకు డిపాజిట్ చేశారనే విషయాన్ని తెలుసుకోవాలని సీఐడీ అధికారులు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా… ఈ 800 మంది డిపాజిట్ల రూపంలో మార్గదర్శిలో భారీ ఎత్తున బ్లాక్ మనీ వ్యవహారం నడుస్తోందని సీఐడీ అనుమానిస్తోందని అంటున్నారు. ఇదే నిజమైతే… మార్గదర్శి నల్లడొంక మొత్తం కదిలినట్లే అని అంటున్నారు పరిశీలకులు.