చంద్రబాబు అరెస్టు విషయంలో అంత సీరియస్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి సూచించారా.? ఈ విషయమై సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలిశారనీ, రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అరెస్టుపై చంద్రబాబు ముందస్తు సంకేతాలు.. ఇవన్నీ చిరంజీవి – పవన్ కళ్యాణ్ భేటీలో చర్చకు వచ్చాయట.
చంద్రబాబు అరెస్టు తర్వాత, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారనీ, సినిమాలు.. కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుకున్న సమయంలో చంద్రబాబు ప్రస్తావన వస్తే, పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి ‘జాగ్రత్త’ అని సూచనలాంటి హెచ్చరిక చేశారనీ అంటున్నారు. ఇది నిజమేనా.? ఎవరైనా సృష్టించిన ప్రచారమా.? అన్నది తేలాల్సి వుంది.
ప్రత్యక్షం చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా, తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఆయన తెలుసుకుంటూనే వున్నారు. వైసీపీ నేతలు సహా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పలువురు నేతలు, పార్టీలకతీతంగా చిరంజీవిని కలుస్తూనే వున్నారు.
అలా కలిసినప్పుడు సహజంగానే రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి. చిరంజీవి అలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు, కేవలం విని ఊరుకుంటున్నారా.? కొన్ని సలహాలూ తన దగ్గరకు వచ్చినవారికి ఇస్తున్నారా.? ఏమో, సలహాలు ఇస్తుండొచ్చు.. సూచనలు చేస్తుండొచ్చు. అలాంటప్పుడు, తన తమ్ముడికి చిరంజీవి సలహా ఇవ్వకుండా వుంటారా.?
ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం టీడీపీనే. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రజారాజ్యం పార్టీపై జరిగిన దుష్ప్రచారం బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుని చిరంజీవి ఒకింత ‘హ్యాపీగానే’ తీసుకోవచ్చునన్నది ఓ వాదన. ఈ నేపథ్యంలోనే తమ్ముడ్ని చిరంజీవి వారించొచ్చు. కానీ, పవన్ కళ్యాణ్ తన అన్న సూచనని లైట్ తీసుకుని, చంద్రబాబుకి మద్దతు ప్రకటించి వుండొచ్చు.
టీడీపీ శ్రేణులతో కలిసి జనసేన శ్రేణులు నేడు గ్రౌండ్ లెవల్‌లో పని చేయడం, చాలామంది మెగాభిమానులకైతే అస్సలు గిట్టడంలేదు.