చిరంజీవి సపోర్ట్ చేస్తే పవన్ గెలుస్తారా.. అలా చేస్తే తప్పేంటంటూ?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలే ఉన్నా ఆ సమయంలో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ప్రజారాజ్యం పార్టీతో పెద్దగా కష్టపడకుండానే చిరంజీవి ఏకంగా తమ పార్టీ 18 స్థానాలలో విజయం సాధించేలా చేశారు. వైఎస్సార్ హవా కొనసాగుతున్న సమయంలో ఇన్ని స్థానాలలో విజయం సాధించడం అంటే తేలికైన విషయం కాదు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి ఉంటే ప్రజారాజ్యం కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేది.

అయితే ప్రస్తుతం చిరంజీవి సపోర్ట్ చేస్తే పవన్ గెలుస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తాజాగా చిరంజీవి రాజకీయాలకు సంబంధించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిరంజీవి విషయంలో మీడియా అతి చేస్తోందంటూ కొంతమంది కామెంట్లు వ్యక్తం చేసినా రాజకీయాలలో చిరంజీవి సంచలనాలను చూసే అవకాశం మిస్ అయిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ లభించిందనే సంగతి తెలిసిందే. అయితే పవన్ జనసేన పార్టీకి చిరంజీవి సపోర్ట్ చేయడం లేదు. జనసేనను సపోర్ట్ చేస్తే ఏపీలో తన సినిమాలను ఇబ్బందులు కలగవచ్చని చిరంజీవి భావిస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సపోర్ట్ చేస్తే మాత్రం జనసేనకు ఇతర మెగా హీరోలు కూడా మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉంది.

చిరంజీవి సపోర్ట్ ఉంటే ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కలిసి పని చేస్తే తప్పేంటంటూ రాజకీయ విశ్లేషకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ రాజకీయాలలో సక్సెస్ సాధించాలంటే చిరంజీవి సపోర్ట్ కచ్చితంగా అవసరమనే సంగతి తెలిసిందే. చిరంజీవి పరోక్షంగా జనసేనకు సపోర్ట్ చేసినా ఆ పార్టీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.