చిరంజీవి వల్లే జనసేనకు నష్టమా.. పవన్ కామెంట్ల వెనుక అర్థం ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మళ్లీ యాక్టివ్ కావడానికి తన వంతు కష్టపడుతున్నారు. జనసేన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వకుండా జనసేన సొంతంగా పోటీ చేస్తే మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేన ఏపీలో పుంజుకోకపోవడానికి చిరంజీవి కూడా కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి జనసేనకు డైరెక్ట్ గా మద్దతు ఇవ్వడం లేదు. చిరంజీవి మద్దతు ఇస్తే చిరంజీవి అభిమానులు కూడా పవన్ కే ఓటేసే ఛాన్స్ అయితే ఉంటుంది. చిరంజీవి జగన్ కు అనుకూలంగా పలు సందర్భాల్లో ప్రవర్తించడం కూడా జనసేన పార్టీకి మైనస్ అవుతుండటం గమనార్హం. చిరంజీవి ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నంత వరకు జనసేనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అయితే ప్రజారాజ్యం పార్టీ ప్రభావం చూపిన స్థాయిలో జనసేన ప్రభావం చూపకపోవడం గమనార్హం. జనసేన తరపున పవన్ రెండు స్థానాలలో పోటీ చేసినా ఫలితం లేకపోయింది.

చిరంజీవి విషయంలో జగన్ వైఖరి సరిగ్గా లేదని నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చిరంజీవితో తన మద్దతు జనసేనకే అని చెప్పేలా చేస్తే మాత్రం కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం రాజకీయాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారనే సంగతి తెలిసిందే.