ఏపీ బీజేపీకి వరుస షాకులు.. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ షాకిచ్చినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. వేర్వేరు కారణాల వల్ల ఏపీ ప్రజలు బీజేపీని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. స్టార్ హీరోల సపోర్ట్ తో రాష్ట్రంలో పుంజుకోవాలని బీజేపి భావిస్తున్నా ఆ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి స్టార్ హీరోల సపోర్ట్ సైతం ప్లస్ కావడం లేదు.

జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి సపోర్ట్ కోసం బీజేపీ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలకు తగిన ఫలితాలు రాలేదు. వేర్వేరు పార్టీలతో ఈ సినీ హీరోలకు అనుబంధం ఉండటం సైతం నెగిటివ్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. వరుస షాకుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్లాలో బీజేపీకి సైతం అర్థం కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ బీజేపీ పుంజుకోవాలంటే బీజేపీకి బలమైన నాయకులు అవసరం కావడంతో పాటు ఇతర పార్టీలు బలహీనపడాల్సి ఉంది. రాజకీయంగా పలుకుబడి ఉన్నప్పటికీ ఆ పలుకుబడి వల్ల బీజేపీకి పెద్దగా లాభం చేకూరడం లేదు. బీజేపీ ఏపీలో అధికారంలోకి రావాలన్నా మరో 30 సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి బెనిఫిట్ కలిగే అవకాశం ఉన్నా బీజేపీ చేస్తున్న చిన్నచిన్న తప్పులు ఆ పార్టీకి మైనస్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది. మోదీ ఏపీకి ప్రాధాన్యత ఇస్తే మాత్రమే ఏపీలో పరిస్థితులు మారే అవకాశం ఉంది.