కోడెలపై చీటింగ్ కేసు.. బాబు లైన్ క్లియర్!

టీడీపీ నేఅ, శాసనబ్సభ మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంపై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడులు పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన కోర్టు ఆదేశాలు జారీచేయడంతో కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే… శివరాం, అతడి భార్య పద్మప్రియ ల విజ్ఞప్తి మేరకు శివరాం కు చెందిన కైరా ఇన్ ఫ్రా కంపెనీలో గుంటూరుజిల్ల తెనాలికి చెందిన బాలవెంకటసురేష్ అనే వ్యక్తి రూ.24.25 లక్షలు పెట్టుబడిగా పెట్టారంట. వీళ్లతో పాటు మరో ముగ్గురు సుమారు కోటి రూపాయలవరకూ పెట్టుబడులు పెట్టారంట.

అందుకు సంబందించి లావాదేఈలు అన్నీ చెక్కుల ద్వారానే జరిపారట. వీరి పెట్టూబడి, అందుకు త్తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది.. అంటే.. 2017లో తిరిగి ఇచ్చేలా శివరాం, అతడి భార్య ఒప్పందం చేసుకున్నారంట. దీంతో ఎన్నిసార్లు అడిగినా.. 2017 కాస్తా… 2023 అయినా కూడా డబ్బులు తిరిగి చెల్లించడంలేదంట. దీంతో బాదితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. దీంతో శివరాంపై 420, 407, 403, 386, 389, 120బి, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు!

అయితే… కన్నా లక్ష్మీనారయణకు కాకుండా, తనకే సత్తెనపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలని గతకొన్ని రోజులుగా బాబుపై కోడెల శివరాం ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే! దీనికి బాబు ఇంకా పూర్తి అంగీకారం తెలపకుండానే… సత్తెనపల్లిలో టీడీపీ తరుపున తానే పోటీచేస్తున్నానంటూ నియోజకవర్గంలో కార్యకర్తలను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు శివరాం. కాగా… ఈ నియోజకవర్గంలో బాబు అనుమతితో.. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ గ్రౌండ్ లెవెల్ పనులు మొదలుపెట్టారు.

అయితే తాజాగా శివరాం పై చీటింగ్ కేసు నమోదవడంతో.. ఈ సాకుని వాడుకుని శివరాం ని సైడ్ చేసెయ్యడానికి బాబుకి లైన్ క్లియర్ అయ్యిందని అంటున్నారు సత్తెనపల్లి తమ్ముళ్లు!