మూడు రాజధానులను ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండ్ కో ఎంత సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారో తెలిసిందే. అమరావతి రైతులతో పాటు రోడ్డెక్కి నిరసనలు తెలపలేకపోయినా చట్టపరంగా వీలవుతుందోమనని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేసో..మరో రకంగానే ఆపాలని పసుపు నేతలు సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటికే రాజధానుల అంశం తమకు సంబంధం దేదని..రాష్ర్ట ప్రభుత్వం ఇష్టమని కేంద్ర క్లియర్ గా చెప్పేసింది. అయినా టీడీపీ తాము పట్టినా కుందేలి కి మూడేకాళ్లు అన్న వైఖరిని మార్చుకోవడం లేదు. చివరికి బీజేపీతో చెలిమి కోసం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా రాజధానుల తంతు సాగుతోంది. తాజాగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు టీడీపీ నేతలు రాసిన లేఖను పరిశీలిస్తే విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ లేఖలో రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఒకవేళ రైతులతో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రెండు లక్షల కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాది కాలంగా రైతులు ప్రభుత్వం తో యుద్దం చేస్తున్నారని..అయినా కనికరం అనేది లేకుండా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాల మధ్య సమస్య తలెత్తినప్పుడు ఆర్టికల్ 248 ప్రయోగించాలని నేరుగా పార్లమెంట్ లోనే ఈ విషయాన్ని తేల్చాలని తల తోకాలేని వాదనని తెరపైకి తీసుకొచ్చింది.
మరి ఇన్నాళ్లు వినిపించని కొత్త వాయిస్ ని చంద్రబాబు ఇప్పుడు దేనికోసం తెరపైకి తీసుకొచ్చినట్లు? అంటే ఏపీలో బీజేపీని పార్టీని బలహీన పరచడానికేనా? అన్న ప్రశ్న రెయిజ్ కాకపోదు. రాజధాని విషయంలో కేంద్రం స్పష్టంగా తన వైఖరి చెప్పినప్పుడు మళ్లీ ఆర్టికల్ 248, రెండు లక్షల కోట్లు రైతులకు ఇవ్వాలనడం వెనుక చంద్రబాబు రాజకీయం వ్యహాం లేదా? అన్నది తెలియంది కాదు.