2014-19 మధ్య చంద్రబాబు ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా?

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని ఒక విషయం ఇప్ప్పుడు వైరల్ గా మారింది.

ఆ వివరాల ప్రకరం… 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆస్తులు రూ.177 కోట్లుగా ఉండగా.. 16 కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. అయినప్పటికీ… 2014 అఫిడవిట్‌ ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆయన రికార్డులకెక్కారు. ఇక 2019లో చంద్రబాబు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ లో తనకు రూ.668 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

ఈ లెక్కన చుసుకుంటే చంద్రబాబు అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం… ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు రూ.491 కోట్ల మేర పెరిగాయన్నమాట. దీంతో… 2019లో దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు చంద్రబాబు.

ఈ నేపథ్యంలో… ప్రస్తుతం స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లో భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 22 వరకూ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నారు!

ఇక తాజా నివేధిక ప్రకారం కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శివకుమార్ ఆస్తుల విలువ రూ. 1,413 కోట్లుగా ఉంది. ఆయన తర్వాత కర్ణాటక ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ రూ.1,267 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.

వీరి అనంతరం కర్ణాటక కాంగ్రెస్‌ కు చెందిన ప్రియా కృష్ణ రూ.1,156 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో… నాలుగో స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.