నిమ్మగడ్డకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా ? ఏంటది ?

Chandrababu to give offer to Nimmagadda Ramesh Kumar
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం తుది దశకు చేరుకున్నట్టే ఉంది.  రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకుని కొన్ని నెలల పాటు వివాదాల్లో నిలిచారు ఆయన.  కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేసిన ఆయన ఇప్పుడు అదే కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహిస్తానంటూ నోటిఫికేషన్ విడుదలచేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.  ఈసీ విడుదల చేసిన  ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేసింది.  దీంతో ఇప్పుడప్పుడే ఎన్నికలు జరగవని తేలిపోయింది.  ఎన్నికల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, ప్రభుత్వం సూచనలు పాటించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఏమిటని కోర్టు మొట్టికాయలు వేసింది.  ఈ తీర్పును సవాల్ చేస్తూ నిమ్మగడ్డ సుప్రీం కోర్టుకు వెళ్లినా వెళ్ళవచ్చు. 
 
Chandrababu to give offer to Nimmagadda Ramesh Kumar
Chandrababu to give offer to Nimmagadda Ramesh Kumar
ఇన్నాళ్లు నిమ్మగడ్డను చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ రాజకీయంగా ఓ ఆయుధంలా వాడారు.  వైఎస్ జగన్ రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని అంటూ ఆరోపణలు గుప్పించారు.  నిమ్మగడ్డ తిరిగి నియామకం కావడంతో జగన్ సర్కార్ వైపు తప్పును తోసేసి ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డను ఉసిగొల్పారు.  ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఈసీ ప్రభుత్వ సలహాలను ధిక్కరించి మరీ నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రేరేపించారు.  ఈ ఎపిసోడ్ మొత్తంలో చివరికి బాధితుడిగా మిగిలింది నిమ్మగడ్డే.  పదవీ విరమణ చేసే సమయంలో ఇలా అతి పెద్ద పొరపాటు చేసేలా చేశారు.  ఈరోజు హైకోర్టు తీర్పుతో రాజ్యాంగబద్ధమైన పదవిలో నిమ్మగడ్డ ఎంత చులకనగా నడుచుకున్నారో రాష్ట్రం మొత్తం చూసింది. 
 
ఇక త్వరలోనే ఆయన పదవీ విరమణ ఉంటుంది.  ఇప్పటికే చంద్రబాబుకు అనుచరుడు, అనఫీషియల్ టీడీపీ సభ్యుడు అంటూ ఆయన మీద ముద్ర పడిపోయింది.  ఇక పదవి నుండి బయటికొచ్చాక ఆయన్ను చంద్రబాబు పార్టీలోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  ఎందుకంటే నిమ్మగడ్డకు పాలన విధానాల  మీద, రాజ్యాంగపరమైన అంశాల మీద పట్టుంది.  ఆయన్ను పక్కన పెట్టుకుంటే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే మార్గాలను చూపిస్తారేమోనని బాబుగారు ఆలోచించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  ఇక నిమ్మగడ్డ విషయానికొస్తే ఆయనకు కూడ రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్టే ఉంది.  లేకపోతే ఇన్ని నెలలు రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా నిలబడగలరా.  మరి చూడాలి చంద్రబాబు నిమ్మగడ్డను ఆఫర్ ఇస్తారా లేదా.. ఒకవేళ ఇస్తే దాన్ని నిమ్మగడ్డ అందుకుంటారా లేదా అనేది.