చంద్రబాబు కుడికంట్లో నీళ్లు… కారణం ఇదే!

ఏపీలో ఎన్నికల రాజకీయాలు మొదలైపోయాయి. ఒకరు యువగళం పాదయాత్ర అంటే.. మరొకరు వారాహి యాత్ర అంటున్నారు. మధ్యలో చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టబోతున్నాం అని ప్రకటించారు. ఇక అధికార వైసీపీ… ఎక్కడికక్కడ జిల్లాల్లో సభలు పెట్టుకుంటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటూ.. ప్రజలకు ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు ఒక గుడ్ న్యూస్ అంతలోనే ఒక బ్యాడ్ న్యూస్… కన్ ఫ్యూజన్ లో పాడేశాని తెలుస్తుంది.

వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీని గద్దె దించాలని, తాను ఎమ్మెల్యే అవ్వాలని పవన్ కల్యాణ్ రెండు పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో పవన్ సహకారంతో ఏదో రకంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఫిక్సయ్యారు. కలిసొస్తే బీజేపీని కలుపుకుందా.. లేకపోతే పవన్ తోనే బండి నడిపించేద్దామని బలంగా భావిస్తున్నారు.

దీంతో చంద్రబాబు ఆశయసాధనకు తోడుగా “యువగళం” యాత్ర మొదలుపెట్టారు నారాలోకేష్. జగన్ పై భారీ భారీ డైలాగులు చెబుతున్నారు. వైసీపీ నేతలకు తనను చూస్తే ఫ్యాంటులు తడిచిపోతున్నాయని చెప్పే పనికి కూడా పూనుకున్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఈ పాదయాత్రను పూర్తిచేసి ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి ఎంటరయ్యారు.

వైసీపీ రహిత ఏపీయే లక్ష్యమని నిన్నటివరకూ చెప్పి… ఇప్పుడు వైసీపీ రహిత గోదావరి అని చెబుతూ… ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రతో దూసుకుపోతున్నారు పవన్ కల్యాణ్. జగన్ ను రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని చెబుతున్నారు. అదే తన లక్ష్యమని చెబుతున్నారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పవన్ వారాహి యాత్రకు వస్తున్న జనంలో పావు వంతు కూడా లోకేష్ యువగళం పాదయాత్రకు రావడం లేదు. పాదయాత్ర మొదలై సుమారు ఐదు నెలలు అవుతున్నా… పాదయాత్రకు ఆశించిన స్థాయిలో ఆదరణ దొరకడం లేదు. దీంతో… ఆ ఫోటోలు జూం చేసి వేయలేక ఆ పార్టీ అనుకూల మీడియా సైతం జిల్లా ఎడిషన్ లకు పరిమితం చేసేసింది. ఇప్పుడు బాబుకు ఇదే టెన్షన్ పెడుతుందని అంటున్నారు పరిశీలకులు.

కారణం… ఈ ఎన్నికల వరకూ చంద్రబాబుకు కుడికన్ను నారా లోకేష్ అయితే, ఎడమ కన్ను పవన్ కల్యాణ్! ఇక్కడ ఎడమ కన్నుకు ప్రస్తుతానికి బాగానే పనిచేస్తుంది. జనసమీకరణ విషయంలో పవన్ సభలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని జరిగిపోతుంది. కానీ.. ఎంత హంగామా చేసినా, ఎంత హడావిడి చేసినా లోకేష్ పాదయాత్రకు మాత్రం జనాలు రావడం లేదు. దీంతో… చంద్రబాబు కుడికంట్లో నీళ్లు కారుతున్నాయి.. లోకేష్ విషయంలో బాబు కన్నీటి పర్యంతం అవుతున్నారని అంటున్నారు పరిశీలకులు! ఎంతైనా… సొంత పుత్రుడు సొంత పుత్రుడే గా…!!!