ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూల ఫలితాలు రాగా ఆ ఫలితాల వల్ల టీడీపీ ప్రస్తుతం సంబరాలు జరుపుకుంటోంది. 2024 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపు అని టీడీపీ ఫిక్స్ అయింది. ఇతర పార్టీలతో పొత్తు ఉన్నా లేకపోయినా సమస్య లేదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెమ్మదిగా టీడీపీ పుంజుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేనకు 20 సీట్లే ఎక్కువని టీడిపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.
20 సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కు 20 సీట్లు ఇవ్వడమే ఎక్కువని టీడీపీ భావిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే కేవలం 20 సీట్లు మాత్రమే ఇస్తే మాత్రం పవన్ అంగీకరిస్తారా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. సీట్ల సమస్య వల్లే పవన్ పొత్తును అధికారికంగా ప్రకటించడం లేదు.
జనసేన సొంతంగా పోటీ చేస్తే మాత్రం 1, 2 సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసినా గెలవడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నా ఫలితాలు అనుకూలంగా అయితే ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ సీట్లు ఇవ్వకపోతే జనసేన ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.
చంద్రబాబు సైతం ఇకపై జనసేన విషయంలో మొండిగానే ముందుకెళ్లనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు లేకపోతే మాత్రం మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు జనసేన విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.