ఓటుకునోటు : చంద్రబాబుకు సంబంధమే లేదట…జనాలేమన్నా పిచ్చోళ్ళా ?

తాజాగా స్టేట్మెంట్ విన్నవారందరిలోను విస్మయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ,  తెలంగాణాలో ఓటుకునోటు కేసులో వీడియో టేపులతో అడ్డంగా దొరికిన తర్వాత రేవంత్ రెడ్డిపై జరుగుతున్న ఐటి దాడులకు టిడిపికి సంబంధమే లేదని తేల్చేశారు. అసలు ఓటుకునోటు కేసుకు, టిడిపికి సంబంధం ఏంటని చంద్రబాబు వేసిన ప్రశ్నకు ఎంపిలెవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఓటుకునోటు కేసుకు తనకు కూడా సంబంధం ఏమీ లేదని కానీ ఆ కేసుకు, టిడిపికి, ఆ కేసుకు తనకు లింక్ పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు అనగానే ఎంపిలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.

ఇక్కడ చరిత్రను ఒకసారి చూద్దాం. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా వేం నరేందర్ రెడ్డిని పోటీలోకి దింపింది. నిజానికి టిడిపి అభ్యర్ధి గెలిచే అవకాశమే లేదన్న విషయం అందరికీ తెలుసు. అయినా పోటీలోకి చంద్రబాబు అభ్యర్ధి ఎందుకు దింపారో అర్ధం కాలేదు. అయితే, 2015, జూన్ 8వ తేదీన హఠాత్తుగా ఓ విషయం బయటపడింది. తెలంగాణాలో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేయటంలో అప్పటి టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రూ 50 లక్షలతో పట్టుబడ్డారు. తర్వాత కొద్ది సేపటికే డబ్బులు ఇస్తున్న వీడియో టేపులు కూడా వెలుగుచూశాయి. దాంతో ఆ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సరే, తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందే.

ఓటుకునోటు కేసులో పట్టుబడిన టిడిపి ఎంఎల్ఏలు రేవంత్, సండ్ర వెంకటవీరయ్య అండ్ కో కేవలం తెరమీద కనబడుతున్న పాత్రలు మాత్రమే. ఎంఎల్ఏల కొనుగోలులో తెరవెనుక సూత్రదారి చంద్రబాబే అన్న విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. ఆ కేసు విచారణ జరిగితే తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న భయంతోనే కేసు విచారణ జరక్కుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు కోర్టుల్లో స్టే తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే మళ్ళీ ఇంతకాలానికి డొంక కదులుతోంది. అందుకే ఎన్నికల సభల్లో కెసియార్ మాట్లాడుతూ, ఓటుకునోటు కేసులో చంద్రబాబు దొరికిన దొంగన్నారు. బ్రీఫ్ డ్ మీ అంటూ ఆడియోటేపుల్లో దొరికిన దొంగ చంద్రబాబు అంటూ విరుచుకుపడుతున్నారు.  ఇది..అందరికీ తెలిసిన విషయాలు.

కానీ విచిత్రంగా టిడిపిపి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఓటుకునోటు కేసుతో తనకు సంబంధమే లేదని చెప్పటంతో నేతలందరికీ మతిపోయింది. ఆ కేసును అనవసరంగా టిడిపికి ముడిపెడుతున్నారంటూ అమాయకంగా చంద్రబాబు చెప్పటంతో ఏం చెప్పాలో ఎంపిలకు అర్ధం కాలేదు. స్టీఫెన్ సన్ తో ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు తనది కాదని కానీ తనదే అనికాని ఇంత వరకు బహిరంగంగా చెప్పుకోలేని దౌర్భాగ్యస్ధితిలో చంద్రబాబున్నారు. అటువంటిది ఆ కేసుకు తనకు, పార్టీకి ఏమిటి సంబంధమని అడిగితే నమ్మటానికి జనాలేమన్నా పిచ్చోళ్ళా ?