చంద్రబాబు యుద్ధం ప్రకటించారు..ఎవరిపైనో తెలుసా ?

దేశంలో టెక్నాలజీకి తానే ఆధ్యుడనని తరచూ చెప్పుకునే చంద్రబాబునాయుడు తాజాగా ఎటక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవిఎం) పై యుద్దం ప్రకటించారు. అసలు ఈవిఎంలను ఒకపుడు ఇదే చంద్రబాబు స్వాగతించారు. తర్వాత మళ్ళీ వ్యతిరేకించారు లేండి. అంటే చంద్రబాబు ఎప్పుడు గెలిచినా ఈవిఎంలను స్వాగతిస్తుంటారు. అదే ఓడిపోతే మాత్రం వెంటనే ఈవిఎంలను వ్యతిరేకిస్తుండటం అందరికీ తెలిసిందే. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత చంద్రబాబు ఈవిఎంలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విచిత్రంగా ఉంది. ఈవిఎంలను ఎందుకంతలా చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు ?

 

ఎందుకంటే, తెలంగాణాలో ఓటర్లు చంద్రబాబుకు కొర్రు కాల్చి బాగా వాత పెట్టారు. మొన్ననే జరిగిన తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబుకు ఏ స్ధాయిలో తల బొప్పి కట్టిందో అందరూ చూసిందే. తెలంగాణా ఎన్నికల ఫలితాల తర్వాత ఈవిఎంల పనితీరు, కొత్తగా ప్రవేశపెట్టిన వివి ప్యాట్లపై అనేక ఆరోపణలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లకు లెక్కింపు సమయంలో ఓట్లకు తేడాలున్నట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరే ఏం జరిగినా, ఎలా జరిగినా మొత్తానికి టిఆర్ఎస్ బాగా లాభపడిన మాట వాస్తవం. అసలు గెలవరనుకున్న టిఆర్ఎస్ అభ్యర్ధులు కూడా 30, 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవటంతో నిజానికి అందరూ ఆశ్చర్యపోతున్నది నిజం.

 

తెలంగాణాలో మహాకూటమి అభ్యర్ధులు ఓడిపోవటానికి ఈవిఎంల్లో మోసాలే కారణమని చంద్రబాబు కూడా బలంగా నమ్ముతున్నట్లున్నారు. అందుకే ఏపిలో ఈవిఎంల ద్వారా జరిగే ఓటింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచమంతా బ్యాలెట్ ద్వారానే ఎన్నికల జరుగుతున్నపుడు మన దేశంలో మాత్రం ఈవిఎంలెందుకంటూ చంద్రబాబు లాజిక్ మొదలుపెట్టారు. అందుకనే త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఈవిఎలకు బదులు మళ్ళీ బ్యాలెట్ విధానాన్నే అమలు చేస్తామని కూడా ప్రకటించేశారు.

 

చంద్రబాబు వరస చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటమి తప్పదని గ్రహించినట్లే అర్ధమవుతోంది. ఈవిఎంలుంటే పోలింగ్ లో రిగ్గింగ్, దొంగ ఓట్లకు కష్టమని గ్రహించినట్లున్నారు. అందుకనే బ్యాలెట్ పద్దతిలో అయితే ఏదోలా ఫలితాన్ని మ్యానేజ్ చేసుకోవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా కనబడుతోంది. ఎటూ అధికారం ఉంది కాబట్టి పోలింగ్ సిబ్బందంతా చంద్రబాబు అదుపులోనే ఉంటారు. అందుకనే ఇఫ్పటి నుండే ఈవిఎంలను వ్యతిరేకిస్తూ పేపర్ బ్యాలెట్ పై యుద్ధం ప్రకటించారు.